Begin typing your search above and press return to search.

దుల్క‌ర్ షేర్ చేసిన ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా

దుల్క‌ర్ షేర్ చేసిన ఫోటోలో అత‌నితో పాటూ అత‌ని భార్య అమ‌ల్ సుఫియా, వారి కూతురు అమీరా స‌ల్మాన్ ఉంది.

By:  Tupaki Desk   |   6 May 2025 4:12 PM IST
దుల్క‌ర్ షేర్ చేసిన ఫోటోతో ఫ్యాన్స్ ఫిదా
X

మామూలుగా సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాలంటే హీరోయిన్ల ఫోటోలో లేదా ఏదైనా సినిమా పోస్ట‌ర్లో షేర్ చేస్తూ ఉండాలి కానీ దుల్క‌ర్ స‌ల్మాన్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట ఆయ‌న ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తుంది. మే 5న దుల్క‌ర్ స‌ల్మాన్ కూతురు అమీరా స‌ల్మాన్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా దుల్క‌ర్ చేసిన ఓ పోస్ట్ ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది.


దుల్క‌ర్ షేర్ చేసిన ఫోటోలో అత‌నితో పాటూ అత‌ని భార్య అమ‌ల్ సుఫియా, వారి కూతురు అమీరా స‌ల్మాన్ ఉంది. ఫోటో చూడ్డానికి చాలా సింపుల్ గానే ఉన్న‌ప్ప‌టికీ ఆ ఫోటో చూడ్డానికి ఎంతో ఎట్రాక్టివ్ గా క‌నిపిస్తుంది. దుల్క‌ర్ షేర్ చేసిన ఫోటో గ్లామ‌ర్ ఫోటో కాక‌పోయినా అందులోని అత‌ని ఫ్యామిలీ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

దుల్క‌ర్ ఫ్యామిలీ లైఫ్ ను ఎప్పుడూ బ‌య‌ట‌కు తీసుకురాకుండా వీలైనంత వ‌ర‌కు ప్రైవైట్ గానే ఉంచుతాడు. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే ఫ్యాన్స్ కోసం ఇలాంటి ఫోటోల‌ను షేర్ చేసి వారి ముచ్చ‌ట తీరుస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే దుల్క‌ర్, అత‌ని భార్య అమ‌ల్ సుఫియా ఇద్ద‌రూ చెన్నైలోని ఒకే స్కూల్ లో చ‌దువుకున్నార‌ని, ఆ త‌ర్వాత కొన్ని సార్లు అనుకోకుండా క‌ల‌వ‌డం, ఆపై దుల్క‌ర్ అమ‌ల్ కు ఫేస్‌బుక్ లో మెసేజ్ చేయ‌డం ఇవ‌న్నీ చాలా త‌క్కువ మందికే తెలుసు.

దుల్క‌ర్ ఓ వైపు ఫ్యామిలీతో ఉంటూ త‌న కూతురి బ‌ర్త్ డే ను సెల‌బ్రేట్ చేస్తూనే మ‌రోవైపు సినిమాల ప‌రంగా దూసుకెళ్తున్నాడు. త్వ‌ర‌లోనే దుల్క‌ర్ న‌హాస్ హిదాయ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఐ యామ్ గేమ్ తో మ‌ల‌యాళ సినిమాకు తిరిగి రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ త్రివేండ్రంలో మొద‌లైంది.

ఐ యామ్ గేమ్ తో పాటూ దుల్క‌ర్ లైన‌ప్ లో ప‌లు ఇండ‌స్ట్రీల నుంచి విభిన్న సినిమాలున్నాయి. త‌మిళంలో కాంత సినిమా చేస్తున్న దుల్క‌ర్, తెలుగులో ఆకాశంలో ఒక తార లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు. దుల్క‌ర్ నుంచి వ‌చ్చిన లాస్ట్ సినిమా ల‌క్కీ భాస్క‌ర్ ఆడియ‌న్స్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుని బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో ఇప్పుడు అత‌న్నుంచి ఎలాంటి సినిమాలొస్తాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.