ఆ బిజినెస్‌లోనూ దుమ్ముదులిపేస్తున్న దుల్కర్
అంతే కాకుండా తనదైన సరికొత్త కథలతో హీరోగా, నటుడిగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు దుల్కర్
By: Tupaki Desk | 17 Jun 2025 10:48 PM ISTదుల్కరన్ సల్మాన్.. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది. అంతే కాకుండా తనదైన సరికొత్త కథలతో హీరోగా, నటుడిగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు దుల్కర్. సీతారామమ్, లక్కీ భాస్కర్ వంటి వరుస సక్సెస్‌లతో హీరోగా మాంచి క్రేజ్ మీదున్న దుల్కర్ సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకుంటూ దక్షిణాదిలో హాట్ టాపిక్‌గా మారాడు. హీరోగా వరుస కథాబలమున్న క్రేజీ సినిమాల్లో నటిస్తున్న దుల్కర్ అదే స్పీడుతో బిజినెస్‌మెన్‌గానూ సక్సెస్ అవుతున్నాడు.
ఓ పక్క హీరోగా నటిస్తూనే సొంత బ్యానర్ వేఫరెర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా చాలా వరకు తెలుగు, తమిళ, కన్నడ క్రేజీ సినిమాలని కేరళలో రిలీజ్ చేస్తూ సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిపించుకుంటున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పలు క్రేజీ ప్రాజెక్ట్‌లని దుల్కర్ తన సొంత బ్యానర్ వేఫరెర్ ఫిల్మ్స్‌పై కేరళ అంతటా రిలీజ్ చేయబోతున్నాడు. ఆ సినిమాల్లో దుల్కర్ నటిస్తున్న తెలుగు సినిమా ``కాంత`, ఆకాశంలో ఒక తార` కూడా ఉండగా మిగతావి క్రేజీ సినిమాలు.
ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో నటించిన `కుబేర` మూవీని దుల్కర్ కేరళలో రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీ జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత అంటే జూలై 25న (డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు) రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ `కింగ్‌డమ్`ని కూడా తనే మలయాళంతో రిలీజ్ చేయబోతున్నాడు.
ఇక `ప్రేమలు`ఫేమ్ నస్లేన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా దుల్కర్ నిర్మించిన మలయాళ మూవీ `లోఖా - చాప్టర్ వన్: చంద్ర` ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ మూవీని కూడా దుల్కరే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు. ఇక ఫాదర్ మమ్ముట్టి నటించి నిర్మిస్తున్న `కాలమ్ కావల్`ని కూడా దుల్కరే రిలీజ్ చేస్తున్నాడు. ఇలా హీరోగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దుల్కర్ త్రిపాత్రాభినయం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. దుల్కర్ నటిస్తూ రానాతో కలిసి నిర్మిస్తున్న `కాంత`తో పాటు పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్న `ఆకాశంలో ఒక తార` ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
