మరో హీరో కథలో రానా ట్విస్టులు!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరికొత్త కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ "కాంతా"పై సినిమావర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి
By: Tupaki Desk | 22 Jun 2025 9:00 AM ISTమలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరికొత్త కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ "కాంతా"పై సినిమావర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. "ద హంట్ ఫర్ వీరప్పన్" డాక్యుమెంటరీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో 1950ల మద్రాస్ నేపథ్యంలో కథ నడవనుండగా, మానవ సంబంధాల డైమెన్షన్స్‌కి, ఆ సమాజ మార్పులకి అద్దం పడేలా రూపొందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని దుల్కర్ స్వంత బ్యానర్ వేఫారర్ ఫిలిమ్స్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. మేకింగ్ పార్ట్‌లో ఉన్న రానా.. ఈ సినిమాలో నటుడిగా కూడా కనిపించనున్నారట. అది కూడా పూర్తి స్థాయి రోల్ అని, ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారట.
ఈ సినిమాలో రానా ఒక డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే రానా ఈసారి కూడా తన క్యారెక్టర్‌కి డిఫరెంట్ ఎలిమెంట్స్ జతచేసేలా కనిపించనున్నారని టాక్. ఆయన పాత్ర ఈ కథనంలో కీలక మలుపులు తిరిగేలా డిజైన్ చేయబడిందట. కథ నడిపే ప్రాముఖ్యతను మోస్తుందని, ప్రేక్షకులకు న్యూ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుందని అంటున్నారు.
ఇక కథానాయికగా లేటెస్ట్ క్రేజ్ అయిన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కాంతా సినిమా కథ 1950ల చరిత్రను ఆధారంగా చేసుకొని అప్పటి మద్రాస్ నగరంలో మానవ సంబంధాలు, సమాజ పరిణామాలపై ఫోకస్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. కథ వింటేజ్ నేపథ్యంతో ఉన్నప్పటికీ.. ప్రస్తుత తరానికి అర్ధమయ్యేలా నేరేషన్ మోడరన్‌గా సాగుతుందని సమాచారం.
ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ హై స్టాండర్డ్ లెవెల్‌లో వుండేలా ప్లాన్ చేశారు. చిత్రబృందం అన్ని పనులను పూర్తిచేసి ఈ సినిమాను 2025 ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ రానా దుల్కర్ కలయికలో తెరకెక్కుతున్న తొలి సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథా నేపథ్యం కొత్తగా ఉండటంతో పాటు, రానా పాత్ర మరింత ఆసక్తిని రేపుతోంది. మరి సినిమా కంటెంట్ ఏ స్థాయిలో క్లిక్కువుతుందో చూడాలి.
