ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోల మధ్య ఫైట్..!
ఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోల మధ్య ఫైట్. అది కూడా ఆమె ప్రేమ దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 24 May 2025 6:00 AM ISTఒక హీరోయిన్ కోసం ఇద్దరు హీరోల మధ్య ఫైట్. అది కూడా ఆమె ప్రేమ దక్కించుకునేందుకు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఆమె కోసం ఫైట్ చేస్తున్న ఆ హీరోలు ఎవరు అంటే ఇంకాస్త డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. ఇది రియల్ స్టోరీ అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇది రీల్ స్టోరీ.. తెర మీద చూడబోతున్న కథ తాలూకా లీక్ అన్నమాట. ఒక డాషింగ్ హీరో.. మరో హ్యాండ్సం హంక్ ఈ ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఢీ కొట్టబోతున్నారు అది కూడా ఒక హీరోయిన్ కోసమని తెలుస్తుంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు మిస్టర్ బచ్చన్ భామ భాగ్య శ్రీ బోర్స్. ఆమె ప్రేమ కోసం ఫైట్ చేస్తున్న హీరోల్లో ఒకరు దుల్కర్ సల్మాన్ కాగా మరొకరు దగ్గుబాటి రానా. దుల్కర్, రానా, భాగ్య శ్రీ కలిసి చేస్తున్న సినిమా కాంత. సెల్వమణి సెల్వ రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. హాలీవుడ్ సినిమాలకు అసోసియేట్ గా పనిచేసిన సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది.
కాంత ఈ టైటిల్ తోనే ఇది ఒక హీరోయిన్ ఇంపార్టెంట్ సినిమా అని అర్థమవుతుంది. అంతేకాదు ఆమె ప్రేమ పొందడం కోసం ఇద్దరు కథానాయకులు ఉంటారని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్, రానా ఇద్దరు నువ్వా నేనా అనేలా ఈ సినిమాలో నటించనున్నారు. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ స్టోరీ సెలక్షన్ మీద ఆడియన్స్ కి మంచి ఒపీనియన్ ఉంది. ఈ క్రమంలో అతను కాంత చేస్తున్నాడు కాబట్టి సినిమాలో విషయం ఉందని ఫిక్స్ అయ్యారు.
ఇక రానా కూడా తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తాడు. ఐతే ఈ సినిమాలో రానా విలనా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక కాంత కోసం ఇద్దరు హీరోలు ఫైట్ చేయడం మాత్రం సంథింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు. కాంత పోస్టర్ తోనే భాగ్య శ్రీ అదరగొట్టేసిందని అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆమె కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇదే కాదు భాగ్య శ్రీ ఖాతాలో కింగ్ డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలు కూడా ఉన్నాయి.
