వారసుడు ఇలా చప్పగా ఉంటే ఎలా?
మాలీవుడ్ ఇండస్ట్రీలో మమ్ముట్టి...మోహన్ లాల్ ఎంత పెద్ద స్టార్లు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఐదు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు.
By: Tupaki Desk | 10 May 2025 8:30 PMమాలీవుడ్ ఇండస్ట్రీలో మమ్ముట్టి...మోహన్ లాల్ ఎంత పెద్ద స్టార్లు అన్నది చెప్పాల్సిన పనిలేదు. ఐదు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మమ్ముట్టి 400 చిత్రాల్లో నటించిన చరిత్ర సొంతం. మోహన్ లాల్ ఆ చరిత్రకు అతి చేరువలో ఉన్నారు. ఏడాదికి పది సినిమాలైనా రిలీజ్ చేయడం ఆ సీనియర్ స్టార్ల ప్రత్యేకత. మమ్ముట్టి యాక్టివ్ లో ఉండగానే తనయుడు దుల్కర్ సల్మాన్ పెద్ద స్టార్ అయ్యాడు. తెలుగు లోనూ దుల్కర్ కి మంచి గుర్తింపు ఉంది.
పాన్ ఇండియా మార్కెట్ కోసం సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మాలీవుడ్ నుంచి సక్సెస్ అవ్వడం కష్టమని భావించిన దుల్కర్ ఆ ఛాన్స్ టాలీవుడ్ నుంచి తీసుకున్నాడు. కొంత కాలంగా తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు. అలా తండ్రికి తగ్గ తనయుడిగా దుల్కర్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నాడు. కానీ మోహన్ లాల్ తనయుడు మాత్రం ఇంకా ఆ రేంజ్ కి చేరుకోలేదు.
ప్రణవ్ మోహన్ లాల్ ఇప్పటికే మాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లోనూ నటించాడు. తండ్రి నటించిన సినిమాల్లో కూడా భాగమయ్యాడు. కానీ సోలోగా తనని తాను ఇంకా స్టార్ గా మలుచు కోలేకపోయాడు. ప్రణవ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఎక్కువగా వెకేషన్లకు వె ళ్తుంటాడు. ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టమట. అందుకే నిత్యం అలా ప్రపంచ పర్యటన చేస్తూనే ఉంటాడుట.
ప్రస్తుతం ప్రాన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే ప్రణవ్ లాల్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కష్టమే. అసలే ఇండస్ట్రీలో టప్ కాంపిటీషన్ నడుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్లు సక్సెస్ అవుతున్నారు. కెరీర్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. కానీ ప్రణవ్ యాక్టింగ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. మోహన్ లాల్ కూడా తనయుడి ఇష్టానికే వదిలేసినట్లు కనిపిస్తుంది.