షర్టు లేకుండా హీరోయిన్ తో ప్రదీప్.. క్యాచీ లుక్!
ఇప్పుడు తాజా గా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
By: Tupaki Desk | 11 May 2025 12:34 PMప్రదీప్ రంగనాథన్ హీరోగా, ప్రేమలు పాప మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న తాజా సినిమా ‘డూడ్’. క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు తాజా గా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ కొత్త పోస్టర్‌లో హీరోయిన్ మమితా బైజును పరిచయం చేశారు. గ్రీన్ షర్ట్, జీన్స్‌తో మోడ్రన్ లుక్‌లో కనిపించిన మమితా కర్లీ హెయిర్‌తో స్టైలిష్‌గా మెరిసింది. ప్రదీప్ రంగనాథన్‌తో ఆమె షేర్ చేసిన కెమిస్ట్రీ ఈ పోస్టర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
అటు ప్రదీప్ రంగనాథన్ మాత్రం షర్ట్ లేకుండా, ఒంటిపై రంగులతో స్టైలిష్‌గా నిలబడి తన స్వాగ్‌ను ప్రదర్శించాడు. ఇద్దరిలో కనిపించిన ఫ్రెష్ ఎనర్జీ, కూల్ వాయిబ్స్ సినిమా కంటెంట్ ఎలాగుండబోతుందనే ఉత్కంఠను పెంచాయి. ప్రముఖ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి మంచి హైప్ ఉందట.
మ్యూజిక్, బోల్డ్ ప్రెజెంటేషన్, లవ్ కామెడీ తో కథనం ‘డూడ్’ ను ఈ పండుగ సీజన్‌లో ఒక యూత్ ఫేవరెట్‌గా నిలపబోతున్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌లో కనిపించిన విజువల్స్, వారి పాత్రల డిఫరెంట్ షేడ్స్ సినిమాకు గల మల్టీ లేయర్డ్ టోన్‌ను సూచిస్తున్నాయి. ఈ చిత్రం దీపావళి 2025 నాటి పాన్ ఇండియాగా విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్, ఈ సినిమాతో ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే లక్ష్యంతో ఉన్నాడు. కాగా మమితా బైజు 'ప్రేమలు' హిట్‌తో సౌత్‌లో స్టార్ ఫాలోయింగ్ అందుకుంది. ఈ కాంబినేషన్ తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ బాగా వర్కౌట్ అయ్యే అవకాశముంది. ఇక ఈ లేటెస్ట్ పోస్టర్‌ను చూస్తే, డూడ్ చిత్రం ఓ స్టైలిష్ ప్రేమకథతో పాటు ఫన్, డ్రామా, యాక్షన్‌ల మిక్స్ ప్రేక్షకులను అలరించబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను కూడా ప్రొడక్షన్ పరంగా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ స్టన్నింగ్ కాంబోతో వచ్చే ‘డూడ్’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో దీపావళి రోజున తెలుస్తుంది.