భారీ రేటుకు డ్యూడ్ రైట్స్.. కారణమిదే!
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.
By: Tupaki Desk | 19 July 2025 12:11 PM ISTషార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ప్రదీప్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది. లవ్ టుడే సినిమాతో హీరోగా, డైరెక్టర్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రదీప్ డ్రాగన్ సినిమాతో రూ. 100 కోట్ల మార్కెట్ ను అందుకున్నారు.
డ్రాగన్ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ లో రెండు సినిమాలను లైన్ లో పెట్టారు ప్రదీప్. అందులో ఒకటి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాగా రెండోది డ్యూడ్. ఇందులో డ్యూడ్ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, కీర్తీశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ హీరోయిన్, ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి ఓ వార్త వినిపిస్తోంది. డ్యూడ్ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను మేకర్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కు రూ.25 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. డ్రాగన్ సినిమాతో ప్రదీప్, ప్రేమలు సినిమాతో మమిత ఇద్దరూ రూ.100 కోట్ల మార్క్ ను అందుకోవడం వల్లే డ్యూడ్ కు ఈ స్థాయి బిజినెస్ జరిగిందని అంటున్నారు.
కేవలం డిజిటల్ రైట్స్ తోనే డ్యూడ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే ఇక థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో ఎక్కువ మొత్తంలోనే బిజినెస్ అయ్యే అవకాశముంది. చూస్తుంటే డ్యూడ్ సినిమా రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ అందుకునేలా కనిపిస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న డ్యూడ్ సినిమా 2025 దీపావళి సందర్భంగా రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.
