Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్.. తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా!

డబ్బింగ్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Aug 2023 4:42 AM GMT
బాక్సాఫీస్.. తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా!
X

డబ్బింగ్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ముఖ్యంగా తమిళ హీరోల సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్, విశాల్ లాంటి హీరోలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. వారి సినిమాలు చాలా వరకు టాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాయి.

ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో హైయెస్ట్ షేర్ కలెక్ట్ చేసిన డబ్బింగ్ సినిమాలు చూసుకుంటే మొదటి స్థానంలో రాకింగ్ స్టార్ యాష్ కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ ఉంది. ఈ చిత్రం ఏకంగా 84.25 కోట్లు కలెక్ట్ చేసింది. తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ మూవీ 54 కోట్ల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. ఇప్పుడు మూడో స్థానంలోకి సూపర్ స్టార్ కొత్త మూవీ జైలర్ వచ్చింది. ఈ మూవీ పది రోజుల్లోనే 37.09 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం విశేషం

నాలుగో స్థానంలో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రోబో ఉండటం గమనార్హం. ఈ చిత్రం 36 కోట్లు కలెక్ట్ చేసింది. నెక్స్ట్ కన్నడ హిట్ మూవీ కాంతారా 29.65 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. నెక్స్ట్ చియాన్ విక్రమ్ ఐ మూవీ 28.10 కోట్ల షేర్ ని అందుకుంది. ఫ్లాప్ టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ ఈ చిత్రం సాధించడం విశేషం. తరువాత స్థానంలో మళ్ళీ సూపర్ స్టార్ కబాలి సినిమాతో నిలిచారు. ఈ మూవీ 22.6 కోట్ల షేర్ అందుకుంది.

లారెన్స్ కాంచన 3 మూవీ 20 కోట్ల షేర్ రాబట్టింది. నెక్స్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ 18.05 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగింది. లారెన్స్ కాంచన 2 మూవీ 17.8 కోట్లు కలెక్షన్స్ అందుకుంది. కమల్ విక్రమ్ 17.80 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 16.6 కోట్ల షేర్ ని సాధించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ మూవీ 16.33 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. సూర్య 24 మూవీ 15.6 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

ఇలా అత్యధిక సార్లు సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు రాష్ట్రాలలో తన సినిమాల ద్వారా భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలిగారు. దీనిని బట్టి రజినీకాంత్ స్టామినా ఏంటో అంచనా వేయవచ్చు. మిగిలిన సినిమాలలో కూడా మెజారిటీ తమిళ్ మూవీస్ ఉండటం విశేషం.