Begin typing your search above and press return to search.

డబ్బింగ్ సినిమాలు vs చిన్న సినిమాల ఫైట్

ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు సూపర్ హిట్స్ తో జర్నీ స్టార్ట్ చేసింది

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:53 AM GMT
డబ్బింగ్ సినిమాలు vs చిన్న సినిమాల ఫైట్
X

ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ ఇండస్ట్రీ రెండు సూపర్ హిట్స్ తో జర్నీ స్టార్ట్ చేసింది. హనుమాన్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బొమ్మ పడగా, కింగ్ నాగార్జున నా సామిరంగా ద్వారా మరో హిట్ వచ్చింది. అలాగే గుంటూరు కారం మూవీ బ్రేక్ ఈవెన్ వరకు వచ్చి ఆగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. సైంధవ్ డిజాస్టర్ కోటాలోకి వెళ్ళిపోయింది. జనవరి నెల ఆఖరు శుక్రవారం ఎక్కువ సినిమాలే థియేటర్స్ లోకి వస్తున్నాయి.

హాన్సికా మొత్వానీ డిఫరెంట్ క్యారెక్టర్ తో చేసిన ప్రయోగాత్మక థ్రిల్లర్ మూవీ 105 మినిట్స్ జనవరి 26న రిలీజ్ అవుతోంది. హాన్సికా కెరియర్ లో డిఫరెంట్ అటెంప్ట్ తో చేస్తోన్న మూవీ ఏ మేరకు మెప్పిస్తుంది అనేది చూడాలి. నవీన రెడ్డి లీడ్ రోల్ లో నటిస్తోన్న బిఫోర్ మ్యారేజ్ అనే మూవీ కూడా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రెజెంట్ జెనరేషన్ యూత్ కల్చర్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ మూవీ కథాంశం ఉండబోతోంది.

అలాగే మెకానిక్ అనే చిన్న సినిమా కూడా థియేటర్స్ లోకినే శుక్రవారం రాబోతోంది. ప్రేమలో అనే చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అలాగే మూడో కన్ను అనే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. రామ్ అనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీతో కొత్తవాళ్లు తమ లక్ టెస్ట్ చేసుకుంటున్నారు. ఇలా ఆరు చిన్న సినిమాలు ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తున్నాయి.

వీటితో పాటు శివ కార్తికేయన్ తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ అయలాన్ కూడా ఈ వారమే వస్తోంది. ఏలియన్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ మూవీ చేయడంతో తమిళనాట పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్ అంటే కామెడీ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్ జనవరి 25న థియేటర్స్ లోకి వస్తోంది.

ఈ సినిమాని సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నారు. మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన పీరియాడికల్ మూవీ మలైకోటై వాలిబన్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి.