ఇదే నా ప్రేమ భాష.. కూతురి కోసం దీపిక ఏం చేసిందంటే?
నా కూతురు మొదటి బర్త్ డే కోసం కేక్ చేశానంటూ వైట్ స్టాండ్ పై పెట్టిన చాక్లెట్ కేక్ ఫోటోను దీపికా షేర్ చేయగా ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది.
By: Tupaki Desk | 10 Sept 2025 4:11 PM ISTబాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ 2018లో పెళ్లి చేసుకోగా వారికి గతేడాది సెప్టెంబర్ 8న ఓ పాప జన్మించింది. గత దీపావళి సందర్భంగా ఆ పాపను ప్రపంచానికి పరిచయం చేశారు ఈ సెలబ్రిటీ కపుల్. దీపికా- రణ్‌వీర్ ల కూతురి పేరు దువా. ఆ పేరుకి అర్థం ప్రార్థన అని, తమ ప్రార్థనలకు సమాధానంగా కూతురు పుట్టిందని, అందుకే తమ బిడ్డకు ఆ పేరుని పెట్టినట్టు అప్పట్లో దీపికా తెలిపారు.
సింపుల్ గా దువా బర్త్ డే సెలబ్రేషన్స్
రీసెంట్ గా దువా ఫస్ట్ బర్త్ డే ను చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు దీపికా, రణ్‌వీర్. మామూలుగా సెలబ్రిటీలు, కాస్త డబ్బున్న వాళ్లు ఎవరైనా సరే తమ పిల్లల బర్త్ డే ను ఎంతో గ్రాండ్‌గా చేస్తుంటారు. కానీ దీపికా మాత్రం తన కూతురి ఫస్ట్ బర్త్ డే ను చాలా సింపుల్ గా తనదైన స్టైల్ లో సెలబ్రేట్ చేశారు. తన కూతురు దువా కోసం స్వయంగా దీపికానే ఓ కేకును తయారు చేశారు.
కూతురి బర్త్ డే పోస్ట్ నెట్టింట వైరల్
తన కూతురి కోసం కేక్ ను తయారు చేసి ఇదే లవ్ లాంగ్వేజ్ అంటూ దీపికా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నా కూతురు మొదటి బర్త్ డే కోసం కేక్ చేశానంటూ వైట్ స్టాండ్ పై పెట్టిన చాక్లెట్ కేక్ ఫోటోను దీపికా షేర్ చేయగా ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయింది. దీపిక పోస్టుకు కాజల్, బిపాసా బసు, భూమి పడ్నేకర్ లాంటి సెలబ్రిటీలు సైతం దువాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే దీపికా పదుకొణె ఆఖరిసారిగా సింఘం అగైన్ సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో రణ్‌బీర్, కరీనా కపూర్, అజయ్ దేవణ్, అక్షయ్ కుమార్ నటించగా గతేడాది రిలీజైంది. ప్రస్తుతం దీపికా చేతిలో కింగ్ సినిమాతో పాటూ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా AA22XA6 కూడా ఉంది. వీటితో పాటూ దీపిక చేతిలో కల్కి2 కూడా ఉంది.
