Begin typing your search above and press return to search.

శర్వా36.. గురి చూసి కొడుతున్నాడు..!

కెరీర్ లో 34 సినిమాల్లో సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ తన 35వ సినిమాగా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 8:21 AM GMT
శర్వా36.. గురి చూసి కొడుతున్నాడు..!
X

యువ హీరోల్లో అభిరుచి గల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్ ఈమధ్య కెరీర్ లో కాస్త దూకుడు తగ్గించినట్టు అనిపిస్తుంది. చేస్తున్న సినిమాలు బాగాలేకనో లేక రిలీజ్ టైం కుదరకనో కానీ శర్వానంద్ సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. అందుకే కొద్దిగా గ్యాప్ ఇవ్వడం మంచిదని అనుకున్నాడు. కెరీర్ లో 34 సినిమాల్లో సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ తన 35వ సినిమాగా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కూడా శర్వానంద్ మార్క్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ హిట్ డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు శర్వానంద్. లాస్ట్ ఇయర్ హిట్ సినిమాల్లో ఒకటైన సామజవరగమన సినిమాను డైరెక్ట్ చేసిన రామ్ అబ్బరాజు తన సెకండ్ సినిమాను శర్వానంద్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా కూడా సామజవరగమన తరహాలోనే ఫన్ అండ్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ ని సెలెక్ట్ చేశారట. భీమ్లా నాయక్ నుంచి ఈమధ్య వచ్చిన డెవిల్ వరకు తను ఉన్న సినిమా గురించి పాజిటివ్ టాక్ వచ్చేలా చేసుకుంటున్న సంయుక్త మీనన్ ఈ సినిమాకు స్పెషల్ క్రేజ్ తీసుకురానుంది. హిట్ డైరెక్టర్ హిట్ హీరోయిన్ ఈసారి శర్వానంద్ గురి పెట్టి మరీ చేస్తున్న ఈ కాంబినేషన్ అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

ఈమధ్య కాలంలో టికెట్ కొన్న ఆడియన్ కి రెండున్నర గంటలు ఎంటర్టైన్మెంట్ అందిస్తే చాలు సినిమాను హిట్ చేస్తున్నారు. సామజవరగమన విషయంలో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. అయితే రాం అబ్బరాజు రెండో ప్రయత్నంగా చేస్తున్న శర్వానంద్ 36 సినిమా ద్వితీయ విఘ్నాన్ని దాటుతుందా లేదా అన్నది చూడాలి. శర్వానంద్ రామ్ అబ్బరాజు కాంబో మూవీని ఏకె ఎంటర్టైమెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. తనతో సమానంగా ఉన్న యువ హీరోలంతా కూడా వరుస సినిమాలు సక్సెస్ లతో దూసుకెళ్తుంటే శర్వానంద్ ఒక్కడే వెనకపడ్డాడు. అయితే రాబోతున్న సినిమాలతో శర్వా ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది.