రాత్రి పూట డ్ర*గ్స్ ఇవ్వాలని పట్టుబట్టిన నటుడు?
ఇటీవల మాలీవుడ్‌లో ఆన్ లొకేషన్ డ్రగ్స్ తీసుకుంటున్న నటుల గురించి ఒక ప్రముఖ కథానాయిక ఆరోపించింది.
By: Tupaki Desk | 4 July 2025 6:00 PM ISTఇటీవల మాలీవుడ్‌లో ఆన్ లొకేషన్ డ్ర*గ్స్ తీసుకుంటున్న నటుల గురించి ఒక ప్రముఖ కథానాయిక ఆరోపించింది. పలువురు నటులు తమకు కేటాయించిన హోటల్ లేదా బసలో రాత్రిపూట డ్రగ్స్ తీసుకోవడమే గాక, సెట్స్ కి వచ్చాక కూడా డ్ర*గ్స్ తీసుకుంటారనే ఆరోపణలు రావడం ఆశ్చర్యపరిచింది. చిత్రపరిశ్రమలో డ్రగ్స్ సేవనం అంటే టీటైమ్ లో టీ తాగడం అంత సులువు అని అందరికీ అవగతమైంది.
ఇప్పుడు హిందీ చిత్రసీమలో ప్రముఖ నిర్మాత, మాజీ సీబీఎఫ్‌సి అధ్యక్షుడు ప్రహ్లాజ్ నిహలానీ చేసిన ఆరోపణ చిత్రపరిశ్రమ తీరుతెన్నులపై మరింత స్పష్ఠతనిచ్చింది. అగ్ర కథానాయకులు, దర్శకులు భారీ పారితోషికాలు డిమాండ్ చేయడమే కాదు పరివారం కోసం భత్యాలు, అదనపు సౌకర్యాలను డిమాండ్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఒక ప్రముఖ నటుడు రాత్రి పూట డ్ర*గ్స్ అడిగేవాడట.. పగటిపూట డైట్ ఫుడ్ కూడా కావాలని గొంతెమ్మ కోర్కెలు కోరేవాడని ప్రహ్లాజ్ నిహలానీ తెలిపారు.
కొందరు స్టార్ హీరోలు తమకు ఫలానా కథానాయిక కావాలి అని డిమాండ్ చేస్తూ, నటీనటుల ఎంపికలో తలదూరుస్తారని కూడా ఆయన విమర్శించారు. ఫలానా హీరోయిన్ ని ఎంపిక చేస్తే నిర్మాతకు బంపరాఫర్ ఇచ్చిన స్టార్ హీరో గురించి ఆయన చెప్పారు. 2003 చిత్రం తలాష్ కోసం అక్షయ్ తన సరసన కరీనా కపూర్ మాత్రమే కావాలని పట్టుబట్టాడట. దానికోసం తన పారితోషికంలో సడలింపు ఇచ్చాడట. అప్పటివరకూ దర్శకనిర్మాతలు మాత్రమే కాస్టింగ్ ఎంపికల్లో ఉండేవారు. ఆ తర్వాత హీరోల జోక్యం శ్రుతిమించిందని కూడా నిహలానీ వాపోయారు. ఈరోజుల్లో నిర్మాతలు సౌకర్యాలు, ఏర్పట్లు చూసుకునేవారిగా మారారని కూడా ఆయన ఆవేదన చెందారు. ఒకటికి మించి వ్యానిటీ వ్యాన్లు, ప్రత్యేక హెయిర్‌డ్రెస్సర్లు, ఖరీదైన డైట్ ఫుడ్ వంటివి నేటి తారలు కోరుతున్నారు. క్రియేటర్లు అయిన దర్శకరచయితలను మించి ఆర్టిస్టులు డిమాండ్ చేయడంపైనా ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
