Begin typing your search above and press return to search.

దృశ్యం 3 గూస్ బంప్స్ ప్లానింగ్..!

దృశ్యం 3 అంటూ ఈమధ్య అజయ్ దేవగన్ ఒక అనౌన్స్ మెంట్ చేయగా జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 1:30 PM
దృశ్యం 3 గూస్ బంప్స్ ప్లానింగ్..!
X

మళయాళం నుంచి వచ్చే థ్రిల్లర్ కథలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అదేంటో అక్కడి దర్శకుల్లా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎవరు తీయలేరు అనే విధంగా వారి సినిమాలు ఉంటాయి. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్స్ మీద ఆ సస్పెన్స్ ని కొనసాగిస్తూ ఆడియన్స్ ని సీడ్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టగలిగే రైటింగ్ తో ఆకట్టుకుంటారు. ఇలాంటివి మలయాళం నుంచి చాలా సినిమాలు రాగా వాటిలో దృశ్యం సినిమా ఒకటి. జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దృశ్యం మాత్రమే కాదు దృశ్యం 2 కూడా అదే తరహాలో ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాలపై ఆడియన్స్ చూపించిన అభిమానం వల్ల దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ ఇలా మాత్రుక కథను ఏమాత్రం ట్రాక్ తప్పకుండా సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. తెలుగులో దృశ్యం సినిమాను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా దృశ్యం 2 సినిమాను మాత్రం జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.

ఐతే దృశ్యం 3 సినిమా విషయంలో మెగా ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. దృశ్యం 3 అంటూ ఈమధ్య అజయ్ దేవగన్ ఒక అనౌన్స్ మెంట్ చేయగా జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ఐతే ఈ రెండు సినిమాల కథలు వేరని అనుకున్నారు. కానీ దృశ్యం లవర్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ జీతూ జోసెఫ్ దృశ్యం 3 కథను అన్ని భాషల్లోకి అందిస్తున్నారట. దృశ్యం 3 మలయాళంలో రావడం మళ్లీ దాన్ని ఇతర భాషల్లో రీమేక్ చేయడం కాకుండా దృశ్యం 3 ని మలయాళంలో, హిందీలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారట.

కేవలం మలయాళం, హిందీ మాత్రమే కాదు తెలుగు, తమిళ్ లో కూడా కథను సిద్ధం చేసి ఆ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడం లేట్ అయినా కూడా తప్పకుండా రిలీజ్ డేట్ మాత్రం ఒకటే అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఓ విధంగా అసలు సిసలు పాన్ ఇండియా బొమ్మగా దృశ్యం 3 ని ప్లాన్ చేస్తున్నాడు జీతూ జోసెఫ్. ఇదే ప్లాన్ వర్క్ అవుట్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. జీతూ జోసెఫ్ మీద ఎలాగు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంటుంది కాబట్టి మలయాళంతో పాటు ఇతర భాషల మేకర్స్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.