దృశ్యం పార్ట్ 3.. వాళ్లు హ్యాపీ, వీళ్లకు డౌట్స్
మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. దీంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 19 July 2025 1:00 PM ISTసాధారణంగా మన దగ్గర సస్పెన్స్ థ్రిల్లర్లకు ఆదరణ ఎక్కువ. అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిందే దృశ్యం. దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మలయాళ స్టార్ మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. దీంతో మేకర్స్ దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ తీసుకొచ్చారు.
తొలి భాగానికి సీక్వెల్ గా తీసిన రెండో భాగాన్ని 2021 కరోనా సమయంలో రిలీజ్ అయ్యింది. ఓటీటీలో విడుదలైనప్పటికీ ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. తొలి పార్ట్ కు వచ్చిన ఆదరణే దీనికీ దక్కింది. దీంతో సక్సెస్ ఫుల్ గా దృశ్యం వెంచర్ లో రెండు పార్ట్ లు కంప్లీట్ అయ్యాయి. ఇక ఈ వెంచర్ ఇక్కడితో ఆగిపోతుందని, ఇంకో భాగం రాదని అనుకున్నారంతా.
కానీ, సీక్వెల్ లో క్లైమాక్స్ లో మూడో పార్ట్ కు లీడ్ ఇచ్చారు. అయితే ఒకే డెత్ మిస్టరీనీ ఇన్ని భాగాలుగా పొడగించడానికి ఇందులో ఏముంటుంది. సస్పెన్స్ ఎలా కొనసాగిస్తారు అని ప్రేక్షకుల భావించారు. అలా చేస్తే అది సాగదీత అవుతుందని భావిస్తున్నారు. అందుకే మేకర్స్ మూడో భాగం తీసుకురారు అని ఫిక్స్ అయిపోయారు. కానీ దర్శకుడు జీతు జోసెఫ్ రీసెంట్ గా దృశ్యం మూడో భాగం గురించి హింట్ ఇచ్చారు.
పార్ట్ 3 స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి చేసినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు నడుస్తున్నాయని, షూటింగ్ త్వరలో కూడా ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఈ వెంచర్ లో మూడో పార్ట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఖుషీ అవుతున్నారు. ఈ అప్డేట్ తో ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు.
అయితే మరోవైపు ఇంకో బ్యాచ్ ఆడియెన్స్, క్రిటిక్స్ దీనికి నెగెటివ్ గా స్పందిస్తున్నారు. ఒకే హత్య కేసు కథను మూడవ భాగం కోసం బలవంతంగా లాగితే, అది వర్కౌట్ కాకపోవచ్చని అంటున్నారు. స్టోరీలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశం ఏం ఉంటుందని, ఇది ఫెయిల్యూర్ కావొచ్చని, దీంతో ఈ సూపర్ హిట్ వెంచర్ లో ఫ్లాప్ పడుంతుదేమో అని అభిప్రాయపడుతున్నారు.
ఇన్ని అవాంతరాలు దాటి దర్శకుడు మూడో భాగాన్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ మెయింటేన్ చేస్తూ తొలి రెండు భాగాల వలే దీన్నీ రూపొందించాలి. మరి ఓవరాల్ గా ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
