Begin typing your search above and press return to search.

దృశ్యం : ముగింపు వల్లే భారీ ఓపెనింగ్స్‌

సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో దృశ్యం 3 కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్‌తో పాతిక కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 Sept 2026 3:00 PM IST
దృశ్యం : ముగింపు వల్లే భారీ ఓపెనింగ్స్‌
X

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రాంచైజీ దృశ్యం నుంచి ఇప్పటి వరకు మూడు పార్ట్‌లు వచ్చిన విషయం తెల్సిందే. మూడు పార్ట్‌లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. త్వరలో మలయాళ దృశ్యం నాల్గవ పార్ట్‌ రానుంది. మూడో పార్ట్‌ ముగింపులోనే నాల్గవ పార్ట్‌ హింట్ ఇవ్వడం జరిగింది. అయితే మలయాళ దృశ్యం సినిమాలకు రీమేక్‌గా రూపొందిన హిందీ దృశ్యంకు మాత్రం ముగింపు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. హిందీ దృశ్యం ప్రాంచైజీకి ముగింపు పలుకబోతున్నారు. దృశ్యం 3 ముగింపు అంటూ యూనిట్‌ సభ్యులు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. దాంతో దృశ్యం ఎలాంటి ముగింపును తీసుకోబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రెండు పార్ట్‌లు మలయాళ దృశ్యంకు రీమేక్‌ కానీ, మూడో దృశ్యం మాత్రం సొంత కథతో రెడీ చేసినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

దృశ్యం 3 సినిమాకి అడ్వాన్స్ బుకింగ్‌...

దృశ్యం 3 పై హిందీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా ముగింపు అంటూ ముందస్తుగా ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి అనడంలో సందేహం లేదు. సాధారణంగా మలయాళ దృశ్యం 3 కి రీమేక్ అయితే కచ్చితంగా ఇంత హైప్ క్రియేట్‌ అయ్యేది కాదు. కానీ ఈ సినిమా కథ వేరు, పైగా దృశ్యం రెండు పార్ట్‌ల కథకు ఇందులో ముగింపు ఉంటుందని, అందరికీ నచ్చే విధంగా ముగింపు ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెప్పడంతో ఆసక్తి పెరిగి అడ్వాన్స్ బుకింగ్‌ పై కనిపిస్తోంది. దృశ్యం 3 ను అక్టోబర్‌ 2, 2026న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. తాజాగా అడ్వాన్స్ బుకింగ్‌ మొదలు అయింది. ఇంకా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటల సమయం ఉందని తెలుస్తోంది.

అజయ్‌ దేవ్‌గన్‌ హీరోగా...

సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో దృశ్యం 3 కచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్‌తో పాతిక కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ట్రేడ్‌ అంచనాల ప్రకారం దృశ్యం 3 సినిమా మొదటి రోజు కచ్చితంగా రూ.50 నుంచి రూ.60 కోట్ల మధ్య వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ఓపెనింగ్‌ను రాబట్టడం అనేది చాలా అరుదుగా కనిపిస్తోంది. దృశ్యం సినిమా ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ భారీ మొత్తం నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా కథకు ముగింపు పలుకుతూ ఈ సినిమా ఉండబోతున్న నేపథ్యంలో మరింతగా అంచనాలు పెరిగాయి. దృశ్యం 3 సినిమాకు మినిమం పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయినా కచ్చితంగా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రియా, టబు ముఖ్య పాత్రల్లో...

ఈనెల ఆరంభంలో వచ్చిన మీర్జాపూర్‌ సినిమాకు భారీ వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా హడావిడి తగ్గిన ఈ సమయంలో విడుదల కాబోతున్న దృశ్యం 3 కి కలిసి వచ్చే అంశం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా తక్కువ సమయంలోనే దృశ్యం 3 సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసే అవకాశం ఉందని బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ దేవగన్‌, శ్రియా, టబు, రజత్‌ కుమార్‌ వంటి ప్రముఖ నటీనటులు నటించిన దృశ్యం 3 కి అభిషేక్ పాఠక్‌ దర్శకత్వం వహించాడు. మలయాళం నుంచి దృశ్యం 4 వచ్చినా హిందీలో దాన్ని రీమేక్ చేసే అవకాశాలు లేవు. హిందీ దృశ్యంలో కథకు మంచి ఎండింగ్‌ లభించి, ప్రేక్షకుల ఆధరణ లభిస్తే తప్పకుండా మలయాళంలోనూ అదే ఎండింగ్‌తో దృశ్యం 4ను తీసే అవకాశాలు లేకపోలేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.