Begin typing your search above and press return to search.

డ్రీమ్ గ‌ర్ల్ 2 ట్రైల‌ర్: వ‌ల‌లు విసిరే క‌న్నె గులాబీ

అంద‌మైన స్త్రీగా మారి యువ‌కుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలోనే అత‌డికి అస‌లు చిక్కులు ఎదుర‌వుతాయి

By:  Tupaki Desk   |   2 Aug 2023 4:31 AM GMT
డ్రీమ్ గ‌ర్ల్ 2 ట్రైల‌ర్: వ‌ల‌లు విసిరే క‌న్నె గులాబీ
X

ఆయుష్మాన్ ఖురానా న‌టించిన 'డ్రీమ్ గర్ల్' బాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అబ్బాయి అమ్మాయిగా మారితే? అనే కాన్సెప్ట్ ని హిలేరియ‌స్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా అద్భుతంగా తెర‌కెక్కించారు. చాలాకాలంగా ఈ సినిమాకి సీక్వెల్ తెర‌కెక్క‌నుంద‌ని ప్ర‌చారం ఉంది. ఎట్ట‌కేల‌కు సీక్వెల్ చిత్రీక‌ర‌ణ ముగించుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. తాజాగా డ్రీమ్ గ‌ర్ల్ 2 ట్రైల‌ర్ విడుద‌లైంది.

ట్రైల‌ర్ ఆద్యంతం క‌డుపుబ్బా న‌వ్వించే ఎలిమెంట్స్ తో అల‌రించింది. ముఖ్యంగా అమ్మాయిగా మారిన‌ ఆయుష్మాన్ న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధులు అవ్వాల్సిందే. అబ్బాయి అమ్మాయిగా మారేందుకు ఎలాంటి ప‌రిస్థితిలు కార‌ణ‌మ‌య్యాయి? అన్న పాయింట్ ఇందులో ఎంతో హిలేరియ‌స్. ఇందులో ఆయుష్మాన్ ప్రియురాలిగా అన‌న్య పాండే న‌టించింది. అయితే త‌న ప్రేయ‌సిని పెళ్లాడాలంటే హీరోకి పాతిక ల‌క్ష‌ల బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం క‌లిగి ఉండాల‌నేది మామ గారి ష‌ర‌తు. దీంతో ప్రేయ‌సిని వ‌దులుకోలేక ఆయుష్మాన్ స్త్రీ వేషంలో పురుషులను ఆకర్షించే వృత్తిలోకి దిగుతాడు.

అంద‌మైన స్త్రీగా మారి యువ‌కుల‌ను ఆక‌ర్షించే క్ర‌మంలోనే అత‌డికి అస‌లు చిక్కులు ఎదుర‌వుతాయి. అంతేకాదు.. ప‌రిస్థితులు అత‌డి చేతిలో లేకుండా క్లిష్ఠంగా మారుతాయి. చివ‌రికి డ్రీమ్ గ‌ర్ల్ వేరొక యువ‌కుడిని పెళ్లాడాల్సి వ‌చ్చాక ఏం జ‌రిగింద‌న్న‌ది తెర‌పైనే చూడాలి. ట్రైల‌ర్ ఆద్యంతం హాస్యం వినోదానికి కొద‌వేమీ లేదు. డైలాగ్స్ చమత్కారంగా ఫ‌న్నీగా ఉన్నాయి. ఆయుష్మాన్ కామెడీ టైమింగ్ అద్భుతం. ప్రముఖ నటుడు అన్నూ కపూర్ జాలీగా న‌వ్వించే పాత్ర‌లో క‌నిపించారు. రాజ్ శాండిల్య దర్శకత్వం వహించిన 'డ్రీమ్ గర్ల్ 2' ఆగస్ట్ 25న విడుదల కానుంది.