Begin typing your search above and press return to search.

'డ్రాగ‌న్' కోసం ఎన్టీఆర్ కొత్త‌గా ఏం చేస్తున్నారు?

మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ `డ్రాగ‌న్‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది.

By:  Ravindar Gorantla   |   6 April 2026 8:15 AM IST
డ్రాగ‌న్ కోసం ఎన్టీఆర్ కొత్త‌గా ఏం చేస్తున్నారు?
X

మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ `డ్రాగ‌న్‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోంది. క‌న్న‌డ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌ల్లో అనిల్ క‌పూర్‌తో పాటు మ‌లయాళ న‌టుడు బీజు బీన‌న్ న‌టిస్తున్నారు. కేజీఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌, స‌లార్‌తో భారీ విజ‌యాన్ని మ‌రోసారి త‌న ఖాతాలో వేసుకున్న ప్ర‌శాంత్ నీల్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఫ‌స్ట్ టైమ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలోని మ‌రో కీల‌క పాత్ర కోసం `ధురంధ‌ర్‌` మూవీతో పాపుల‌ర్ అయిన బిమ‌ల్ ఓబెరాయ్‌ని తాజాగా టీమ్ ఫైన‌ల్ చేసుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయనే స్వ‌యంగా ఓ పోడ్ కాస్ట్ ఇంల‌ర్వ్యూలో వెల్ల‌డించ‌డంతో ఈ వార్త బ‌య‌టికొచ్చింది. దీనిపై ఇంత వ‌ర‌కు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కానీ, మేక‌ర్స్ కానీ ఎలాంటి ప్ర‌క‌టన చేయ‌లేదు. కానీ ఇందులో మాత్రం `ధురంధ‌ర్` న‌టుడు బిమ‌ల్ రాయ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం భారీ స్థాయిలో బ‌రువు త‌గ్గి డాన్ లుక్‌లోకి వ‌చ్చేసిన ఎన్టీఆర్ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌డం తెలిసిందే. తాజాగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ కోసం మ‌రో విద్య‌ని ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా నేర్చుకుంటున్నార‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇండియా, చైనా, భూటాన్‌ బోర్డ‌ర్‌లో జ‌రిగే ప‌వ‌ర్ ఫుల్ స్టోరీగా దీన్ని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కిస్తున్నారు. 1969వ ద‌శ‌కం నేప‌థ్యంలో క‌థ సాగుతుంద‌ని, ఎన్టీఆర్ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డాన్‌గా ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తార‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోందని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ కోసం షార్ట్ బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ క‌ళ‌రిప‌య‌ట్టులో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ని, ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు భారీ స్కోప్ ఉన్న మూవీ కావ‌డం, ప్ర‌త్యేక సన్నివేశంలో క‌ళ‌రియ‌ప‌ట్టుకు సంబంధించిన స‌న్నివేశాలు ఉండ‌టంతో దీనిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకున్న ఎన్టీఆర్ ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ట‌.

ఇందులో ఎన్టీఆర్ మునుపెన్న‌డూ చూడ‌ని బీస్ట్ అవ‌తార్‌లో ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో క‌నిపించ‌నున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌. ఫాస్ట్‌గా షూటింగ్ ని పూర్తి చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే రిలీజ్ ఎప్పుడు అన్న‌ది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. జూన్ 25న రిలీజ్ చేస్తారని ప్ర‌చారం జ‌రుగుతున్నా అప్ప‌టికి సినిమా రెడీ అయ్యే అవ‌కాశం లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.