హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వండి బాస్!
పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ సినిమాలంటే హీరో ఎలివేషన్ మాత్రమే కనిపిస్తుంది. హీరోయిన్ కు అంతగా ప్రాధాన్యత ఉండదు.
By: Tupaki Desk | 6 May 2025 2:30 PMపాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ సినిమాలంటే హీరో ఎలివేషన్ మాత్రమే కనిపిస్తుంది. హీరోయిన్ కు అంతగా ప్రాధాన్యత ఉండదు. `కేజీఎఫ్` , `సలార్` చిత్రాల్లో హీరోయిన్లగా నటించిన శ్రీనిధి శెట్టి `కేజీఎఫ్` రెండు భాగాల్లోనూ పేరుకే హీరోయిన్ కి తప్ప ఆమె పాత్రకు ప్రాముఖ్యత లేనిదిగానే కనిపించింది. `సలార్` చిత్రం తొలి భాగం కథ హీరోయిన్ చుట్టూ తిరిగినా అందులో శ్రుతి హాసన్ హైలైట్ కాలేదు.
హీరోయిన్ కోసం మొదలైన వార్ ఎలా ముగిసింది? అన్నది రెండవ భాగంలో హైలైట్ అవుతుంది. దీంతో రెండవ భాగంలోనైనా శ్రుతి పాత్రకు ప్రాముఖ్య ఉంటుందా? `కేజీఎఫ్ 2` తరహాలోనే మమా అనిపిస్తాడా? అన్నది సస్పెన్స్. దీంతో `డ్రాగన్` చిత్రంలోనైనా హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఆస్కారం ఉండాలని లేడీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నీల్ డ్రాగన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఎంపికైంది. సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇదీ నీల్ మార్క్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. తారక్ పాత్ర మునుపటి హీరోలకంటే బలంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ పాత్ర కు కనీస న్యాయం జరిగేలా హీరోయిన్ పాత్ర ఉండాలని కన్నడ నుంచి లేడీ అభిమానులు నీల్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. `కేజీఎఫ్`, `సలార్` లో హీరో-హీరోయిన్ మధ్య ఎలాంటి డ్యూయెంట్ సాంగ్స్ లేవు.
`డ్రాగన్` లో కూడా ఉంటాయా? లేదా? అన్నది తెలియదు. ఉండే అవకాశం చాలా తక్కువే. ఈ నేప థ్యంలో హీరోయిన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉండాలని..కొంత నేపథ్యం హీరోయిన్ చుట్టూ కూడా ఉంటుం దని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ అభ్యర్ధనలను ప్రశాంత్ నీల్ ఎంతవరకూ తీసుకుంటాడో చూడాలి.