డ్రాగన్: ఇది ప్రివ్యూ మాత్రమే.. ఇంకా చాలా ఉందేమో!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు డ్రాగన్ గ్లింప్స్ అసలు సిసలైన మాస్ ట్రీట్ గా మారింది.
By: M Prashanth | 21 May 2026 12:53 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు డ్రాగన్ గ్లింప్స్ అసలు సిసలైన మాస్ ట్రీట్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి వచ్చిన తొలి గ్లింప్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పాల్సిన పని లేదు. విడుదలైన కొన్ని గంటల్లోనే వీడియో ట్రెండింగ్ లోకి రాగా.. ఇప్పుడు దాని వ్యూస్ కౌంట్ హాట్ టాపిక్ గా మారింది.
మేకర్స్ వివరాల ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ తొలి 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దీంతో భారతీయ సినిమా చరిత్రలోనే ఒకే రోజులో అత్యధికంగా వ్యూస్ అందుకున్న మూవీ గ్లింప్స్ గా రికార్డు క్రియేట్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతే కాదు స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ రగ్గడ్ లుక్, బ్లాక్ బనియన్, స్టైలిష్ గ్లాసెస్ తో కనిపించిన తీరు అభిమానులను మరింత ఎగ్జైట్ చేస్తోంది.
అయితే ఇప్పుడు నెట్టింట వినిపిస్తున్న అసలు చర్చ మరొకటి. గ్లింప్స్ ను చూసిన తర్వాత.. ఇది కేవలం ప్రారంభం అంటే ఒక ప్రివ్యూ మాత్రమేనని, అసలు ప్రమోషన్స్ ఇంకా మిగిలే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా గ్లింప్స్ అంటే చిన్న టీజర్ తరహాలో వీడియోను విడుదల చేస్తారు. కానీ డ్రాగన్ కోసం ప్రశాంత్ నీల్ టీమ్ దాదాపు ట్రైలర్ స్థాయి రన్ టైమ్ తో కట్ సిద్ధం చేసింది.
అందులో యాక్షన్, బ్యాక్ డ్రాప్, క్యారెక్టర్ ఎలివేషన్స్ అన్నింటినీ హైలైట్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక గ్లింప్స్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ 1967 కాలం నాటి నేపథ్యంలో సాగుతుందని.. గ్లోబల్ వార్, నల్లమందు మాఫియా అంశాలను బేస్ చేసుకుని మూవీ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎన్టీఆర్ లుగర్ అనే మోస్ట్ డేంజరెస్ రోల్ లో కనిపించనున్నారని చర్చ నడుస్తోంది.
ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ విజువల్స్ కు తారక్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ జతకావడంతో అభిమానులు ఇప్పటికే ఆ సినిమాను మరో రేంజ్ ప్రాజెక్ట్ గా ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మేకర్స్ ముందున్న రోజుల కోసం స్పెషల్ ప్రమోషనల్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. గ్లింప్స్ కే ఇంత భారీ స్పందన రావడంతో.. టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ వీడియోలు మరింత హై వోల్టేజ్ గా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా నీల్ సినిమాల్లో ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, హీరో ఇంట్రోలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అందుకే ఇప్పుడు డ్రాగన్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ పై భారీ ఆసక్తి కనిపిస్తోంది.
ఇక సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తుండగా.. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా కనిపించనుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆ భారీ యాక్షన్ డ్రామాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
