Begin typing your search above and press return to search.

పెళ్లైన హీరోయిన్ ని కోరుకున్న హీరో!

హిందీ లో ల‌వ్ స్టోరీలో న‌టించాల్సి వ‌స్తే ..ఏ హీరోయిన్ మీ ఛాయిస్ అంటే? మ‌రో ఆలోచన లేకుండా అలియాభ‌ట్ పేరు చెప్పాడు.

By:  Tupaki Desk   |   14 Aug 2023 12:30 PM GMT
పెళ్లైన హీరోయిన్ ని కోరుకున్న హీరో!
X

హీరోయిన్ల విష‌యంలో ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. ఒక‌ప్పుడు పెళ్లైన హీరోయిన్ల‌ను ద‌ర్శ‌క‌-హీరోలు లైట్ తీసుకునే వారు. పెళ్లైన హీరోయిన్ల‌తో రొమాన్స్ ఏంట‌ని? ఎంపిక చేయాలంటే ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించేవారు. మార్కెట్ లో డిమాండ్ ఉందా? లేదా? అని కొన్ని స‌మీక‌ర‌ణాలు చూసుకునేవారు. కానీ ఇప్పుడా సీన్ మారింది. పెళ్లికాని హీరోయిన్ల కంటే పెళ్లైన హీరోయిన్ల‌కే ఎక్కువ డిమాండ్ ఉంది.

హీరోలు కూడా కొత్త భామ‌ల‌తో న‌టించ‌డం క‌న్నా పెళ్లైన సీనియ‌ర్ భామ‌ల్నే కోరుకుంటున్నారు. దీపికా ప‌దుకొణే...క‌రీనా క‌పూర్...స‌మంత‌... కాజ‌ల్ అగ‌ర్వాల్ వంటి భామ‌లే వెంటే ప‌డుతున్నారు. తాజాగా మ‌ల‌యాళం హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఇలాగే పెళ్లైన హీరోయిన్ ని కోరుకుంటున్నాడు. 'కింగ్ ఆఫ్ కొత్త' ప్రీ రిలీజ్ కోసం హైద‌రాబాద్ విచ్చేసిన దుల్క‌ర్ ముందుకు ఓ ఆస‌క్తిర ప్ర‌శ్న వెళ్లింది.

హిందీ లో ల‌వ్ స్టోరీలో న‌టించాల్సి వ‌స్తే ..ఏ హీరోయిన్ మీ ఛాయిస్ అంటే? మ‌రో ఆలోచన లేకుండా అలియాభ‌ట్ పేరు చెప్పాడు. ఆమె యాక్టింగ్ బాగుంటుంది. నేచుర‌ల్ పెర్పార్మెర్. అందుకే ఆమెతో క‌లిసి ఓల‌వ్ స్టోరీలో న‌టించాల‌ని ఉంద‌న్నాడు. హిందీలో అంత మంది హీరోయిన్లు ఉన్నా? ఎందుకు అలియాభ‌ట్ అంటే? అది అంతే అన్న తీరున బ‌ధులిచ్చాడు.

అలియాభ‌ట్ -ర‌ణ‌బీర్ క‌పూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ దంప‌తుల‌కు ఆ పాప జ‌న్మించింది. పెళ్లైన త‌ర్వాత అలియాభ‌ట్ మ‌రింత ఉత్సాహ‌వంతంగానూ క‌నిపిస్తుంది. గ‌ర్భంతో ఉండ‌గానే హాలీవుడ్ సినిమా కోసం యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అలాగే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం ప‌నిచేసింది.

అలియాభ‌ట్ ప‌నితీరును ఉద్దేశించి ఎన్టీఆర్..చ‌ర‌ణ్ కూడా ప్ర‌శంసించారు. త‌న‌లో యాక్టింగ్ స్కిల్స్..ఎన‌ర్జీ..వ‌ర్క్ ప‌ట్ల డెడికేష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. ఈ నేప‌థ్యంలో తార‌క్ కూడా దేవ‌ర సినిమా కోసం అలియాభట్ ని ముందుగా తీసుకోవ‌డం జ‌రిగింది. కానీ అలియాభ‌ట్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఎగ్జిట్ అవ్వాల్సి వ‌చ్చింది.