Begin typing your search above and press return to search.

ల‌క్కీ భాస్క‌ర్ ఇంత‌లోనే 'కాంత‌'.. దుల్క‌ర్ ఇస్పీడ్..

ఇంత‌లోనే ఇప్పుడు రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ప‌ణ‌లో 'కాంత‌' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

By:  Tupaki Desk   |   28 July 2023 4:11 PM GMT
ల‌క్కీ భాస్క‌ర్ ఇంత‌లోనే కాంత‌.. దుల్క‌ర్ ఇస్పీడ్..
X

నేటిత‌రం లో పాన్ ఇండియా స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు దుల్కర్ సల్మాన్. అత‌డు త‌న ప‌రిధిని మల‌యాళం నుంచి తెలుగు-హిందీ భాష‌ల‌ కు విస్త‌రించాడు. పాన్-ఇండియా స్థాయి లో ఉత్తమ నటుల లో ఒకడిగా తన ఖ్యాతిని పెంచుకున్నాడు. ఇటీవ‌ల దుల్కర్ తెలుగులో స్పీడ్ మ‌రింత‌గా పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ ను ప్ర‌క‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.


ఓకే బంగారంతో తెలుగు వారి మ‌న‌సుల‌ పై బ‌ల‌మైన ముద్ర వేసాడు. ఇటీవ‌ల 'సీతారామం' బ్లాక్ బస్టర్ ఫలితం తర్వాత వెంకీ అట్లూరి తదుపరి పాన్-ఇండియా చిత్రం లో దుల్క‌ర్ న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. ఇంత‌కుముందే ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్‌ను ప్రకటించారు.

ఇంత‌లోనే ఇప్పుడు రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్ప‌ణ‌లో 'కాంత‌' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ''చాలా అరుదుగా 'మంచి సినిమా' అనే భావ‌న‌ ను పెంచే కథ తో ఇది తెర‌కెక్కుతోంది. #కాంత అనేది మేధావుల‌ ను ఏక‌తాటిపైకి చేర్చిన ప్రాజెక్ట్. అపారమైన ప్రతిభావంతుడు దుల్కర్ సల్మాన్ ... వేఫేరర్ ఫిలింస్ తో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు DQ .. కాంతా ప్రపంచానికి స్వాగతం'' అంటూ రానా స్వ‌యంగా సోష‌ల్ మీడియా లో ఈ ప్రాజెక్టు ను ప్ర‌క‌టించారు. కాంత చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి రచన & దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.

ఇక దుల్కార్ న‌టించిన మ‌రో పాన్ ఇండియా చిత్రం 'కింగ్ ఆఫ్ కోథా' ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇది ప్ర‌ముఖ గ్యాంగ్ స్ట‌ర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే టీజ‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఆగ‌స్టు లో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇంత‌లోనే దుల్కార్ వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల‌ తో వేడి పెంచుతున్నాడు. నేటిత‌రం హీరోల్లో వేగంగా దూసుకొస్తున్న స్టార్ గా అత‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కుతోంది. ఒక న‌ట‌వార‌సుడిగా టాలీవుడ్ లో చాలామంది న‌ట‌వార‌సుల‌ కు లేని గుర్తింపు ఖ్యాతి అత‌డికి ద‌క్కుతున్నాయి.