Begin typing your search above and press return to search.

అది నచ్చే కింగ్ ఆఫ్ కొత్త చేశా : దుల్కర్ సల్మాన్

ఈ సినిమా ఒక మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా అని కింగ్ ఆఫ్ కొత్త ప్రమోషన్స్ లో చెప్పారు దుల్కర్ సల్మాన్. సినిమాలో యాక్షన్ తో పాటుగా ఫ్రెండ్ షిప్ కూడా ఉంటుందని అన్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:02 AM GMT
అది నచ్చే కింగ్ ఆఫ్ కొత్త చేశా : దుల్కర్ సల్మాన్
X

మలయాళ హీరోనే కానీ పాన్ ఇండియా లెవెల్లో అతనికి క్రేజ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ అయితే అతని సినిమా అంటే మన హీరోల మాదిరిగానే ఆసక్తి చూపిస్తారు. అటు మలయాళంలో సినిమాలు చేస్తూనే తెలుగులో కూడా తన నటనతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న నటుడు హీరో దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం రెండు ప్రత్యేకమైన సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. లేటెస్ట్ గా దుల్కర్ మలయాళంలో నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కిన కింగ్ ఆఫ్ కొత్త సినిమాను అభిలాష్ డైరెక్ట్ చేశారు. డైరెక్టర్ అభిలాష్ తనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్.. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నా కానీ కింగ్ ఆఫ్ కొత్త సినిమాతోనే అది కుదిరింది. ఈ సినిమా ఒక మంచి గ్యాంగ్ స్టర్ డ్రామా అని కింగ్ ఆఫ్ కొత్త ప్రమోషన్స్ లో చెప్పారు దుల్కర్ సల్మాన్. సినిమాలో యాక్షన్ తో పాటుగా ఫ్రెండ్ షిప్ కూడా ఉంటుందని అన్నారు. ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నానని అయితే రెగ్యులర్ గా కాకుండా ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా చేశానని అన్నారు దుల్కర్ సల్మాన్.

కొత్త అంటే మలయాళంలో టౌన్ అని మీనింగ్.. ఈ సినిమాలో ఒక ఫిక్షన్ టౌన్ ని ఏర్పాటు చేశాం. టెక్నికల్ గా ఈ సినిమా చాలా భారీగా ఉంటుందని అన్నారు. తెలుగులో కొత్త అంటే కొత్తది అని వస్తుంది. అందుకే తెలుగు డబ్బింగ్ కోత అని చెప్పామని అన్నారు దుల్కర్. ఇన్నాళ్లు ఆడియన్స్ తనని ఒక లవర్ బోయ్ గా చూశారు. అంతేకాదు ఒకే రకమైన కథలు, పాత్రలు తనకు చేయాలని ఉండదు. అందుకే ఆడియన్స్ తో పాటుగా తనకు తాను సర్ ప్రైజ్ అయ్యే పాత్రలు చేస్తానని అన్నారు దుల్కర్ సల్మాన్.

కింగ్ ఆఫ్ కొత్త కోసం అన్ని భాషల్లో తానే డబ్బింగ్ చెప్పానని.. ఈ సినిమాతో తాను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మారానని అన్నారు దుల్కర్. ఇక సినిమాలో నటించిన ఐశ్వర్య లక్ష్మి గురించి చెబుతూ ఆమె చాలా ప్రతిభ ఉన్న నటి.. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైంది. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం అంతా కూడా తమ బెస్ట్ ఇచ్చారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు దుల్కర్.