Begin typing your search above and press return to search.

ముర‌ళీ శ‌ర్మ భార్య ఎవ‌రో తెలుసా?

రావు ర‌మేష్ లాంటి న‌టుల‌కు ప‌ర్పెక్ట్ రీప్లెస్ మెంట్ అనిపించారు. ముర‌ళి శ‌ర్మ హిందీ నుంచి టాలీవుడ్ కి వ‌చ్చినా.

By:  Tupaki Desk   |   11 Oct 2023 11:33 AM GMT
ముర‌ళీ శ‌ర్మ భార్య ఎవ‌రో తెలుసా?
X

ముర‌ళీ శ‌ర్మ టాలీవుడ్ లో ఎంత బిజీ ఆర్టిస్ట్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. తొలుత ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ల‌తో ఎంట్రీ ఇచ్చినా ఆ త‌ర్వాత శ‌ర్మ‌గారి రూటు మార్చారు. అన్ని ర‌కాల పాత్ర‌లు పోషించ‌గ‌ల న‌టుడ‌ని వివిధ సినిమాలతో నిరూపించారు. ముఖ్యంగా హీరోల‌కు తండ్రి పాత్ర‌ల‌కుగానూ ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. కొన్ని రకాల క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల‌కు ఆయ‌న‌కు మంచి మైలేజ్ ని తీసుకొచ్చాయి.

స‌హ‌జ నట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో త‌న‌దైన ముద్ర వేసారు. రావు ర‌మేష్ లాంటి న‌టుల‌కు ప‌ర్పెక్ట్ రీప్లెస్ మెంట్ అనిపించారు. ముర‌ళి శ‌ర్మ హిందీ నుంచి టాలీవుడ్ కి వ‌చ్చినా. ఆయ‌న తెలుగు న‌టుడే. ఇక్క‌డే పుట్టాడు. అటుపై కుటుంబం వేర్వేరు రాష్ట్రాల్లో ఉండేది. ఆ ర‌కంగా బాలీవుడ్ న‌టుడిగా ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యారు. ఇప్పుడు హిందీ..తెలుగు అని లేకుండా అన్ని భాష‌ల్లోనూ బిజీగా ఉన్నారు.

అయితే ఆయ‌న ఫ్యామిలీ గురించి పెద్ద‌గా తెలియ‌దు. తాజాగా ఆయ‌న భార్య ఎవ‌రు? ఏం చేస్తారు? అన్న వివ‌రాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆమె పేరు అశ్విని కాల‌శేఖ‌ర్. ఆమె కూడా న‌టి. హిందీలో బిజీ ఆర్టిస్టుల్లో ఒక‌రు. తెలుగులో `సీఐడీ` అనే సీరియ‌ల్ లోనూ న‌టించారు. హిందీలో లెక్క‌లేనన్ని సీరియ‌ల్స్ చేసారు. ఆ ర‌కంగా బుల్లి తెర‌పై త‌న‌దైన ముద్ర వేసారు. అశ్విని కొన్ని తెలుగు సినిమాలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

'బ్ర‌ద్రీనాధ్` సినిమాలో హీరోయిన్ త‌మ‌న్నా మేన‌త్త పాత్ర పోషించింది ఈవిడే. అందులో కెల్లీడార్జ్ భార్య పాత్ర పోషించారు. అలాగే ర‌వితేజ `నిప్పు`లోనూ న‌టించారు. చివ‌రిగా తెలుగులో `మెహ‌బూబ` సినిమా చేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. ఇక ముర‌ళీ శ‌ర్మ‌తో అశ్విని కాల‌శేఖ‌ర్ ది రెండ‌వ వివాహం. అంత‌కు ముందు నితిష్ పాండే అనే వ్య‌క్తితో వివాహమైంది. అయితే కొన్నాళ్ల‌కి ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో విడిపోయారు. ఆత‌ర్వాత 2009 లో ముర‌ళీ శ‌ర్మ‌- అశ్వినీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.