Begin typing your search above and press return to search.

ఈ అందాల రాక్షసి మీకు తెలుసా?

ఇక వారి లక్కును పరీక్షించుకుంటూ మిగతా ఇండస్ట్రీలలో కూడా అవకాశం అందుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:16 AM GMT
ఈ అందాల రాక్షసి మీకు తెలుసా?
X

కొంతమంది హీరోయిన్స్ కెరియర్ మొదట్లో ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుని ఆ తర్వాత ఒక్క సినిమాకే మాయం అవుతూ ఉంటారు. ఇక వారి లక్కును పరీక్షించుకుంటూ మిగతా ఇండస్ట్రీలలో కూడా అవకాశం అందుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా కేవలం తెలుగులో ఒకే ఒక సినిమాతో క్లిక్ అయినా బ్యూటీ రియా సేన్.


అమ్మడు మొదట్లో బాలీవుడ్ లో కొన్ని చిన్న సినిమాలు చేసి ఆ తరువాత టాలీవుడ్ పై ఫోకస్ చేయాలని అనుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అవకాశాలు అందుకునే విధంగా కెరీర్ను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయాలి అని అనుకున్నప్పటికీ ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు.

తెలుగులో అప్పట్లో మంచు మనోజ్ తో నేను మీకు తెలుసా? అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఇక మళ్ళీ ఆ తర్వాత ఆమెకు తెలుగులో సరైన అవకాశాలు రాలేదు. ఇక నాలుగు పదుల వయసు దాటినా కూడా తన ఉనికిని చాటుకుని ప్రయత్నం చేస్తుంది. రీసెంట్గా అమ్మడు మరోసారి అందాల రాక్షసి అనే తరహాలో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.

బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ డబు రత్నని నిర్వహించిన ఫోటోషూట్ లో ఆమె పాల్గొంది. ఇక అందులో అమ్మడు భయంకరంగానే తన ఘాటైన అందాలతో స్టిల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమెకు 40 ఏళ్ళు అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక అమ్మడు ఇప్పటికీ పాతికేళ్ల హీరోయిన్ తరహాలో గ్లామర్ తో తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోనే కాకుండా బెంగాలీ మరాఠీ భాషలో కూడా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ అయితే చేస్తోంది ఇక ఆమె సోదరీ రైమా సేన్ కూడా హీరోయిన్ గా ఒకప్పుడు అలానే బిజీగా కనిపించింది. ఇక ఇప్పుడు ఆమె కూడా కొన్ని స్పెషల్ పాత్రలలో కనిపించే ప్రయత్నం చేస్తుంది. ఈ ఇద్దరూ అక్క చెల్లెలు కూడా వయసు పెరిగినా, పోటీ ఎంత ఉన్నా కూడా గ్లామర్ ఇండస్ట్రీని అసలు వదలడం లేదు. నచ్చిన విధంగా అవకాశాలు అందుకుంటూ కెరియర్ను కొనసాగిస్తూ ఉన్నారు.