Begin typing your search above and press return to search.

డౌట్లన్ని ప్రెస్ మీట్ తోనే క్లియర్ చేస్తారా..?

సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ నటిస్తుందన్న న్యూస్ కూడా వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   11 March 2024 3:59 AM GMT
డౌట్లన్ని ప్రెస్ మీట్ తోనే క్లియర్ చేస్తారా..?
X

సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుంది అని ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా కాస్టింగ్ ఇంకా టెక్నిషియన్స్ డీటైల్స్ కోసం కూడా ఆసక్తిగా ఉన్నారు. సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ నటిస్తుందన్న న్యూస్ కూడా వైరల్ గా మారింది.

అయితే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకాలంటే మాత్రం రాజమౌళి మహేష్ ప్రెస్ మీట్ పెట్టాల్సిందే అని అంటున్నారు. తన ప్రతి సినిమా అనౌన్స్ మెంట్ తో పాటుగా మీడియా డౌట్లన్నిటికీ సమాధానం ఇస్తూ జక్కన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాడు. ఈ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటారు.

మహేష్ సినిమాకు సంబంధించిన విషయాల గురించి కూడా ఇలాంటి ఒక ప్రెస్ మీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఆ ప్రెస్ మీట్ ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ రాజమౌళి మహేష్ ప్రెస్ మీట్ లో ఏ వివరాలు అందిస్తారు. సినిమాపై ఆడియన్స్ లో ఉన్న బజ్ పెంచే ప్రయత్నం లో ఎలాంటి లీక్స్ బయట పెడతారు. సినిమా టైటిల్ కథ గురించి రాజమౌళి ఏమన్నా హింట్ ఇస్తారా లాంటి విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది.

మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమాను కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్ల దాకా ఉంటుందని టాక్. విజయేంద్ర ప్రసాద్ కథ అద్భుతంగా రాయగా సినిమా కోసం మహేష్ పూర్తిస్థాయి మేకోవర్ ఉంటుందని తెలుస్తుంది. SSMB29 వ సినిమాగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రికార్డుల మీద గురి పెట్టిందని తెలుస్తుంది. సినిమా

జక్కన్నతో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అటు మహేష్.. సూపర్ స్టార్ కి ఎప్పుడు యాక్షన్ చెప్పాలా అని రాజమౌళి ఇద్దరు సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లే ముందే వర్క్ షాప్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడే సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. RRR తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.