Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ అది ఎందుకు దాస్తున్నాడు..?

పూరీ ఎప్పుడు లేనిది డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్స్ ను రివీల్ చేయకుండా షూటింగ్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   16 April 2024 6:03 AM GMT
డబుల్ ఇస్మార్ట్ అది ఎందుకు దాస్తున్నాడు..?
X

పూరీ, రామ్ ఈ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అయ్యింది. అవసరమైన టైంలో.. అవసరమైన హిట్ గా ఇద్దరి కాంబో మ్యాజిక్ వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఆ తర్వాత పూరీ లైగర్ తో మరోసారి నిరాశపరచగా రామ్ ది వారియర్, స్కంద సినిమాలతో బాబోయ్ అనిపించాడు. అందుకే మళ్లీ ఇద్దరు కలిసి డబుల్ ఇస్మార్ట్ అని మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. రామ్ ఎనర్జీకి పూరీ డేరింగ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు అనిపిస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది. అందుకే ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నాడని తెలిసిందే. పూరీ మార్క్ మాస్ మూవీగా రాబోతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. అయితే సినిమా ప్రచార చిత్రాలు బయటకు వస్తున్నా హీరోయిన్స్ విషయంలో మాత్రం సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు మేకర్స్.

పూరీ ఎప్పుడు లేనిది డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్స్ ను రివీల్ చేయకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఆ ఇద్దరు హీరోయిన్స్ కు ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇద్దరు తమ గ్లామర్ షోతో మైలేజ్ పెంచుకున్నారు. అఫ్కోర్స్ ఆ తర్వాత మళ్లీ వారి సినిమాల ఎంపిక వల్ల వెనకపడ్డారు.

డబుల్ ఇస్మార్ట్ లో కూడా నిధి, నభా లనే రిపీట్ చేస్తున్నాడా లేక ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నా పూరీ ఎందుకు ఆమె పేరును ప్రకటించట్లేదు అన్నది అర్థం కావట్లేదు. డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ ఎవరు.. సినిమాలో ఒక హీరోయినా ఇద్దరా అన్నది కూడా తెలియాల్సి ఉంది. జూన్, జూలై లో రిలీజ్ టార్గెట్ తో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ గురించి ఈ కన్ ఫ్యూజన్ కు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. రామ్ మాత్రం డబుల్ ఇస్మార్ట్ తో డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు.