Begin typing your search above and press return to search.

రామ్ డబుల్ ఇస్మార్ట్.. టీజర్ ఎలా ఉందంటే?

ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2024 5:05 AM GMT
రామ్ డబుల్ ఇస్మార్ట్.. టీజర్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 2019లో వచ్చి బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ పై అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్లు డబుల్ ఇస్మార్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. రామ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ బుధవారం ఉదయం విడుదల చేశారు. రామ్ మార్క్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్ ను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.

'నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులో కాలుతాది' అంటూ రామ్ తెలంగాణ యాసలో తన డైలాగులతో అలరించారు. ఊర మాస్ రోల్ లో అదరగొట్టారు. సంజయ్ దత్ విలనిజం హైలెట్ గా నిలిచింది. కావ్య థాపర్ గ్లామర్ డోస్ బాగానే ఉంది. టీజర్ లో శివుడి సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పాటలో కొన్ని వేల మంది కనిపించేటట్లు ఉన్నారు. నుదిటిన విభూదితో రామ్ డివోషనల్ గా కనిపించారు. దీంతో ఈ సినిమా క్లైమాక్స్ కూడా శివుని రిఫరెన్స్ తో ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

మొత్తానికి డబుల్ ఇస్మార్ట్ టీజర్.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఈసారి కూడా రామ్ డబుల్ ఇస్మార్ట్ అంటూ హిట్ కొట్టబోతున్నారని టీజర్ చూస్తుంటేనే ఈజీగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను 2024 మార్చిలో రిలీజ్ చేయాలని ముందు పూరి జగన్నాథ్ అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. నేడు రిలీజ్ చేసిన టీజర్ తో కొత్త డేట్ అనౌన్స్ చేస్తారని అంతా భావించారు. కానీ మేకర్స్ నేడు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పూరి జగన్నాథ్.. నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరితో పాటు హీరోయిన్ ఛార్మి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్‌ గా ఉన్నారు. రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్‍ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాపై రామ్- పూరి భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇద్దరూ హిట్ కొట్టాలని చూస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.