Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ కొత్త డేట్.. సౌండ్ పెంచాలి పూరి!

డైలాగ్స్ తోనే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసే అతి కొద్ది మంది దర్శకులలో పూరి జగన్నాద్ ఒకరు.

By:  Tupaki Desk   |   16 Feb 2024 11:48 AM GMT
డబుల్ ఇస్మార్ట్ కొత్త డేట్.. సౌండ్ పెంచాలి పూరి!
X

డైలాగ్స్ తోనే బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసే అతి కొద్ది మంది దర్శకులలో పూరి జగన్నాద్ ఒకరు. అయితే చాలాకాలంగా ఆయన మ్యాజిక్ అంతగా క్లిక్ కావడం లేదు. ఒకప్పుడు ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి హీరోలు అందరూ ఎంతో ఆసక్తిని చూపించేవారు. కానీ వరుసగా డిజాస్టర్స్ ఎదురవుతూ ఉండడంతో పూరి మళ్లీ సేఫ్ జోన్ లోకి వచ్చే ప్రయత్నాలు గట్టిగానే చేస్తూ ఉన్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మొత్తానికి సెట్ అయ్యారు అనుకుంటున్నా సమయంలో లైగర్ సినిమాతో మరో గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈ సినిమాను మరిచిపోయే విధంగా తదుపరి సినిమాతో సాలిడ్ గా సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ తోనే డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ వస్తే మాత్రం సినిమాకు మంచి హైప్ వచ్చే అవకాశం ఉంది.

అసలైతే ఈపాటికే హడావుడి మొదలు కావాలి. ఎందుకంటే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే చాలావరకు షూటింగ్ పనులు అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడంతో పాటు సినిమా బిజినెస్ వ్యవహారాలు అలాగే అప్డేట్స్ విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల సినిమా విడుదల డేటు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొత్తానికి కొత్తడేటుగా జూన్ 14 ని ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది మంచి డేట్ అయినప్పటికీ కూడా చిత్ర యూనిట్ మాత్రం ప్రమోషన్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూరీ లైగర్ దెబ్బతో చాలావరకు ఆడియన్స్ లో కొంత నమ్మకం కోల్పోయారు. అటు బయ్యర్లు కూడా అడిగిన రేటుకు సినిమాను కొంటారో లేదో అనేలా పరిస్థితి ఏర్పడింది.

రామ్ పోతినేని కూడా స్కంద దివారియర్ లాంటి సినిమాలతో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. కాబట్టి ఈ కాంబినేషన్ కు ఈసారి సరైన టాక్ రావాలి. ఇక దానికి తగ్గట్టుగా వరుసగా టీజర్ తో అలాగే సాంగ్స్ తో కూడా ప్రమోషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొత్త రిలీజ్ డేట్ ప్రకారం పూరి జగన్నాథ్ కు చాలా సమయమే ఉంది. ఈ గ్యాప్ లోనే మంచి ప్రణాళికలు రచించుకొని సీక్వెల్ ఇస్మార్ట్ జోరు పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఎలాంటి అప్డేట్స్ వదులుతారో చూడాలి.