Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. రామ్ కిర్రాక్ లుక్

ఇక సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఈ సినిమాతోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 7:36 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. రామ్ కిర్రాక్ లుక్
X

రామ్ పోతినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచినటువంటి సినిమా ఇస్మార్ట్ శంకర్. అలాగే పూరి జగన్నాథ్ వరుస అపజయాలతో ఉన్నప్పుడు కూడా ఈ సినిమా ఒక్కసారిగా అతనికి మంచి బూస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఈ సినిమాతోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ముగ్గురు కాంబినేషన్ కు కూడా డబుల్ ఇస్మార్ట్ సినిమా చాలా ఇంపార్టెంట్ గా మారింది.


ఒకవైపు లైగర్ సినిమాతో పూరి డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ డిఫరెంట్ మాస్ యాక్షన్ సినిమాలు చేశాడు కానీ ఏది అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక మణిశర్మ కూడా వరుస డిజాస్టర్ చూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎలాగైనా ఈ ముగ్గురు కలయికలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.

ఫ్యాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇక ఆ రేంజ్ కు తగ్గట్టుగా అప్డేట్స్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ సినిమాను 2024 మార్చ్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఇక నేటితో ఈ సినిమా విడుదలకు కరెక్టుగా 100 రోజుల సమయం ఉంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ లో కూడా హై వోల్టేజ్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లుగా అర్థమవుతుంది. స్టైలిష్ గాగుల్స్ తో డిఫరెంట్ గా మాస్ లుక్కుతో చూస్తుంటే ఈ పాత్ర కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ఆడియోన్స్ లో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ప్లాన్ కు తగ్గట్టుగానే పూరి జగన్నాథ్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ ను కూడా మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.