Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఇంకా ఏదీ సెట్​ అవ్వలే..

పూరి ఇంకా సినిమా కాస్ట్ అండ్ క్రీవ్​కు సంబంధించి ఏవీ ఫైనలైజ్ చేయలేదట.

By:  Tupaki Desk   |   22 July 2023 6:27 AM GMT
డబుల్  ఇస్మార్ట్.. ఇంకా ఏదీ సెట్​ అవ్వలే..
X

"డబుల్‌ ది ఎంటర్‌టైన్‌మెంట్‌! డబుల్‌ ది యాక్షన్‌! డబల్‌ ది మ్యాడ్‌నెస్‌! వి ఆర్‌ బ్యాక్‌ !! చడబుల్‌ ఇస్మార్ట్‌ మోడ్‌ ఆన్‌!".. అంటూ రీసెంట్​గా 'డబుల్‌ ఇస్మార్ట్‌'ను లాంచ్ చేశారు దర్శకుడు పూరిజగన్నాథ్. సక్సెస్ ఫుల్ 'ఇస్మార్ట్‌ శంకర్‌' రామ్‌ పోతినేని-పూరి జగన్నాథ్ కలయికలో రానుంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్ ​పై పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రీసెంట్​గా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైన చిత్రం..ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్​ను ముంబయిలో శరవేగంగా జరుపుకుంటోంది. సాధారణంగా పూరి సినిమా అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​. లైగర్ మూవీ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చినా.. డ‌బుల్ ఇస్మార్ట్ షూటింగ్​ షురూ చేశాక దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్‌ను రూపొందిస్తున్నారని తెలిసింది. దాదాపు 10 రోజుల పాటు ముంబయిలోనే ఈ ఫైట్ తెర‌కెక్కిస్తారట.

అయితే ఓ వైపు షూటింగ్​ను స్పీడ్ ​గా తీసుకెళ్తున్నప్పటికీ.. పూరి ఇంకా సినిమా కాస్ట్ అండ్ క్రీవ్​కు సంబంధించి ఏవీ ఫైనలైజ్ చేయలేదట. హీరోయిన్​, సంగీత ద‌ర్శ‌కుడు, విల‌న్ ​ల కోసం వెతుకుతున్నారట. ఇప్పటికే న‌లుగురు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. వారిలో ఒక‌రిని ఈ నెలాఖ‌రులోగా ఫైన‌లైజ్ చేస్తారట.

ఇకపోతే ఇస్మార్ట్ శంక‌ర్ కోసం మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని సాంగ్స్​, బ్యాక్​ గ్రౌండ్ మ్యూజిక్​.. మూవీ లవర్స్​ ను ఉర్రూతలూగించాయి. అన్నీ సూపర్ హిట్​ గా నిలిచాయి.

సినిమా విజ‌యంలోనూ కీలక పాత్ర పోషించాయి. మరి ఇప్పుడు మ‌ణిశ‌ర్మనే తీసుకుంటారా లేదా ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారా అనేది క్లారిటీ లేదు. కానీ బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం.. కొత్త సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకుంటారని తెలుస్తోంది.

ఇక విలన్ విష‌యానికొస్తే.. ఈ సారి పక్కా బాలీవుడ్​ యాక్టర్​ నే తీసుకువాలని ఫిక్స్​ అయ్యారట. ఆయనకు హిందీ యాక్టర్స్ ​తో మంచి అనుబంధం కూడా ఉంది. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రితో సంప్ర‌దింపులు జరుగుతున్నాయని తెలిసింది.ఇది కూడా వీలైనంత త్వరగా ఫిక్స్​ చేయాలని పూరి చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా ఈ ఏడాది చివ‌రిక‌ల్లా షూటింగ్ పూర్తి చేసి.. 2024 ప్రారంభ నాటికి ఫస్ట్ కాపీని రెడీ చేయాలని ఫిక్స్ అయ్యారట. అలాగే ముందుగా చెప్పినట్టుగానే మార్చి 8కి సినిమాను గ్రాండ్​ గా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.