Begin typing your search above and press return to search.

'డబుల్ ఇస్మార్ట్' మొదటి ఆయుధం.. గెట్ రెడీ!

ఇక ఈ సినిమా జులైలో రిలీజ్ అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.

By:  Tupaki Desk   |   12 May 2024 8:31 AM GMT
డబుల్ ఇస్మార్ట్ మొదటి ఆయుధం.. గెట్ రెడీ!
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. డబుల్ ఇస్మార్ట్ మూవీని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మార్చిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. రామ్ తో పాటు మెయిన్ క్యాస్టింగ్ అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ అప్డేట్ వచ్చి చాలా నెలలు అవుతుండటంతో రామ్ పోతినేని ఫ్యాన్స్ చాలా నిరాశ చెందుతున్నారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ రీసెంట్ గా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమా టీజర్ ను రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా మే15వ తేదీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. 'ది మాక్కికిరికిరీ' డబుల్ ఇస్మార్ట్ టీజర్ మే 15న రానుంది. రెడీగా ఉండండి' అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు మించి డబుల్ ఇస్మార్ట్ ఉంటుందని చెబుతున్నారు. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన రామ్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో రామ్ 1000 వాలా చేతికి కట్టుకుని వేరే లెవల్ లో ఉన్నారు.

క్రేజీ అవుట్ ఫిట్ వేసుకుని మాస్క్ పెట్టుకుని సీరియస్ గా ఉన్నట్టు చూపించారు మేకర్స్. మొత్తానికి మేకర్స్ ఇచ్చిన అప్డేట్ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా జులైలో రిలీజ్ అవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీజర్ తో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావాలంటే.. అది టీజర్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇదే మేకర్స్ కు మొదటి ఆయుధం అన్నమాట. మరి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.

ఇక సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందించిన మణిశర్మ సీక్వెల్‌ కు కూడా క్రేజీ ఆల్బమ్‌ రెడీ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్‌. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ.. రామ్, పూరి జగన్నాథ్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ.