Begin typing your search above and press return to search.

పూరి ఈ డబుల్ టెన్షన్ ఎలా తట్టుకుంటాడో..?

లైగర్ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ సినిమాపైన గట్టిగానే ఉందని తెలుస్తోంది. ఆ సినిమా నష్టాల కారణంగా బయ్యర్లు రోడ్డెక్కి ధర్నా చేశారు.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:40 AM GMT
పూరి ఈ డబుల్ టెన్షన్ ఎలా తట్టుకుంటాడో..?
X

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఈ సినిమా సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని ఛార్మి, పూరీ జగన్నాథ్ కలిసి నిర్మిస్తున్నారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అంతకు మించి ఉండేలా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేశారంట.

లైగర్ ఫ్లాప్ కావడంతో ఈ సారి తనకి బలమైన క్యారెక్టరైజేషన్, పవర్ ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన యాక్షన్ ఎలిమెంట్స్ ని నమ్ముకొని డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. మార్చి 8న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించిన ప్రేక్షకుల ముందుకి రావడానికి మరికొంత సమయం పడుతుందంట. త్వరలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ సిగేస్తున్నాడు.

లైగర్ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ సినిమాపైన గట్టిగానే ఉందని తెలుస్తోంది. ఆ సినిమా నష్టాల కారణంగా బయ్యర్లు రోడ్డెక్కి ధర్నా చేశారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ని కొనడానికి బడా బయ్యర్లు ఇంకా ముందుకి రాలేదంట. డిస్టిబ్యూటర్స్, బయ్యర్లని ఎట్రాక్ట్ చేయాలంటే ఈ మూవీ టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో గట్టిగా బజ్ క్రియేట్ చేయాలి.

గత కొంతకాలంగా మణిశర్మ నుంచి వచ్చిన ఏ మూవీ కూడా సాంగ్స్ పరంగా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఈ సినిమా మాత్రం అతనికి ఓ పెద్ద పరీక్ష పెట్టనుందని చెప్పొచ్చు. లైగర్ తో నష్టపోయిన బయ్యర్లు కొంతమంది డబుల్ ఇస్మార్ట్ ధర తగ్గించి తమకే ఇవ్వాలని అడిగేందుకు సిద్ధం అవుతున్నారంట. ఇక సినిమాను జూన్ 16న విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ కి అయితే మణిశర్మ వండర్ క్రియేట్ చేశారు. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించారు. డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకులని అంచనాలు భారీగానే ఉన్నాయి. సాంగ్స్ తో వచ్చే బజ్ తోనే మూవీపైన హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమా మీద పూరి అలాగే రామ్ మణిశర్మ భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి వారికి డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందనేది చూడాలి.