Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. మొత్తానికి టెన్షన్ తీరినట్లే..

అయితే ఈ సినిమా.. మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   21 March 2024 8:02 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. మొత్తానికి టెన్షన్ తీరినట్లే..
X

ఐదేళ్ల కిందట ఇస్మార్ట్ శంకర్ అంటూ బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబో.. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ తో వస్తోంది. డబుల్ ఇస్మార్ట్ పేరుతో డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దర్శకుడిగా మాత్రమే కాకుండా.. తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ ద్వారా చార్మితో కలిసి నిర్మిస్తున్నారు పూరీ జగన్నాథ్.

అయితే ఈ సినిమా.. మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మహా శివరాత్రి సందర్భంగా మూవీని విడుదల చేయనున్నట్లు గత ఏడాది మేకర్స్ వెల్లడించారు. 100 రోజుల కౌంట్ డౌన్ కూడా పెట్టారు. కానీ సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడంతో రిలీజ్ ను వాయిదా వేశారు. క్వాలిటీ మిస్ కాకుండా మూవీ లవర్స్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.

దీంతో ఈ సినిమా వేసవి కానుకగా విడుదల అవుతుందని అంతా భావించారు. కానీ మేకర్స్ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా లేరు. దీంతో మూవీ మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమా జూన్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోందట. ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన రామ్ కూడా జూన్ రిలీజ్ అని చెప్పారు.

ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ లో మణిశర్మ బిజీగా ఉన్నారట. అయితే ఇస్మార్ట్ శంకర్ కు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. త్వరలో డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి కానుందట. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేయనున్నారట. ఎలా అయినా జూన్ లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ మూవీ 2019లో రిలీజైన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ మార్క్ సినిమాతో రామ్ పోతినేని కెరీర్ లో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మంచి సక్సెస్ దక్కించుకోలేకపోయారు. రెడ్, వారియర్, స్కంద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అటు పూరి కూడా లైగర్ మూవీతో భారీగా నష్టపోయారు. దీంతో ఈ సినిమా వీరిద్దరికీ కీలకమే. తమ కాంబో మరోసారి మ్యాజిక్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.