Begin typing your search above and press return to search.

డబుల్ సిమ్.. డబుల్ ఇస్మార్ట్.. ఏదో వచ్చేలా ఉంది..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ తో పాన్ ఇండియా లెవెల్ లో తను చేసిన భారీ అటెంప్ట్ షాక్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   11 May 2024 8:35 AM GMT
డబుల్ సిమ్.. డబుల్ ఇస్మార్ట్.. ఏదో వచ్చేలా ఉంది..!
X

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ తో పాన్ ఇండియా లెవెల్ లో తను చేసిన భారీ అటెంప్ట్ షాక్ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ డిజాస్టర్ అవ్వడం పూరీకి షాక్ ఇచ్చింది. లైగర్ తర్వాత పూరీని నమ్మి సినిమా చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ ఇచ్చిన రామ్ మాత్రం ఆ రిస్క్ తీసుకున్నాడు. రామ్ కూదా ది వారియర్, స్కంద సినిమాల ఫ్లాప్ వల్ల కెరీర్ లో డైలమాలో పడ్డాడు. అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరు కచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. అందుకే ఇద్దరికీ హిట్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని షురూ చేశారు.


పూరీ సినిమాల్లో కథ కథనాలు ఎలా ఉన్నా టేకింగ్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గదని తెలుస్తుంది. అయితే షూటింగ్ చేస్తున్నారు కానీ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడన్న అప్డేట్ మాత్రం చిత్ర యూనిట్ నుంచి రావట్లేదు. రామ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ విషయంలో కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే అలాంటి వారి కోసమే డబుల్ ఇస్మార్ట్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది.

పూరీ నిర్మాణ సంస్థ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి దీన్**తల్లి దిమాకిరి ఆఇతాంది.. ఏదో వచ్చేలా ఉంది అని అప్డేట్ ఇచ్చారు. ఇక ఇదే కామెంట్ కింద మన ఇస్మార్ట్ శంకర్ తో దీన్**తల్లి నా దిమాక్ ఏందిరా డబుల్ సిమ్ కార్డ్ ఫోన్ లెక్క ఉందని ఒక ఫోటో పెట్టారు. డబుల్ ఇస్మార్ట్ నుంచి త్వరలోనే స్పెషల్ అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ బర్త్ డే మే 15న ఉంది. సో ఆ రోజు సినిమా నుంచి ఒక టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని అంచనా వేయొచ్చు.

డబుల్ ఇస్మార్ట్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు పూరీ జగన్నాథ్. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సంజయ్ దత్ నటిస్తున్నాడని తెలిసిందే. మరి ఇస్మార్ట్ శంకర్ తో జరిగిన ఆ మ్యాజిక్ డబుల్ ఇస్మార్ట్ కు రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.