Begin typing your search above and press return to search.

డబుల్‌ ఇస్మార్ట్‌.. అంతా ఓకేనా?

మొన్నటి వరకు ఆర్థిక సమస్యలు అంటూ డబుల్‌ ఇస్మార్ట్‌ గురించి పుకార్లు షికార్లు చేశాయి.

By:  Tupaki Desk   |   13 May 2024 10:15 AM GMT
డబుల్‌ ఇస్మార్ట్‌.. అంతా ఓకేనా?
X

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం లైగర్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో తదుపరి సినిమా విషయంలో పూరి పై సహజంగానే చాలా ఒత్తిడి ఉంటుంది. లైగర్ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సొంత బ్యానర్ లో రామ్‌ హీరోగా డబుల్‌ ఇస్మార్ట్‌ మూవీని పూరి మొదలు పెట్టాడు.

లైగర్ సినిమాకు భారీగా నష్టపోయిన పూరి జగన్నాధ్ డబుల్‌ ఇస్మార్ట్ సినిమా ను పూర్తి చేసే పరిస్థితి కనపడం లేదు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. అందుకే సినిమా ను మధ్యలో ఆపేశారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇటీవలే ముంబైలో కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు.

మే 15న రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్‌ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ముందుగా ప్రకటించిన విడుదల తేదీకి సినిమా రావడం దాదాపు అసాధ్యం. టీజర్ లో కొత్త విడుదల తేదీని ఏమైనా ప్రకటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొన్నటి వరకు ఆర్థిక సమస్యలు అంటూ డబుల్‌ ఇస్మార్ట్‌ గురించి పుకార్లు షికార్లు చేశాయి. మరి ఇప్పుడు సినిమా ను మళ్లీ మొదలు పెట్టారు కనుక ఆ సమస్యలు అన్నీ కూడా క్లీయర్ అయ్యి ఉంటాయా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

పూరి ఈ సినిమాను ఛార్మి తో కలిసి సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. ఫైనాన్స్ విషయంలో ఇంతకు ముందు ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు ఆ సమస్య లేదు అంటూ పూరి సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో మాదిరిగా అనుకున్నట్లు భారీ బడ్జెట్‌ తో కాకుండా కాస్త కాస్ట్‌ కట్టింగ్‌ చేస్తూ డబుల్‌ ఇస్మార్ట్‌ ను పూరి పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.