Begin typing your search above and press return to search.

డ‌బుల్ ఇస్మార్ట్ అంద‌రికీ అదే ఎన‌ర్జీనివ్వాలి!

`ఇస్మార్ట్ శంక‌ర్` తో రామ్-పూరి-చార్మీ-మ‌ణిశ‌ర్మ ఎలాంటి స‌క్సెస్ అందుకున్నారో? తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2023 11:30 PM GMT
డ‌బుల్ ఇస్మార్ట్ అంద‌రికీ అదే ఎన‌ర్జీనివ్వాలి!
X

`ఇస్మార్ట్ శంక‌ర్` తో రామ్-పూరి-చార్మీ-మ‌ణిశ‌ర్మ ఎలాంటి స‌క్సెస్ అందుకున్నారో? తెలిసిందే. కంటెంట్ స‌హా మ్యూజిక‌ల్ గానూ సినిమా పెద్ద విజ‌యం సాధించింది. అప్ప‌టికే స‌రైన విజ‌యాలు లేక ఉన్న ఆ త్ర‌యాన్ని `ఇస్మార్ట్ శంక‌ర్` విజ‌యం ఓ బూస్టింగ్ లా నిలిచింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప్లాప్ ల ప‌రంప‌ర త‌ప్ప‌లేదు. మ‌ణిశ‌ర్మ సంగీతానికి న్యాయం చేసినా ఆ సినిమాలు ప్లాప్ అవ్వ‌డం ఆయ‌న కెరీర్ పైనా ప్ర‌భావం చూపించాయి.

ఇక పూరి..రామ్ ల‌ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. చేసిన సినిమాలేవి అంచ‌నాలు అందుకోలేదు. పూరి ఆర్దికంగానూ న‌ష్టాలు చూడాల్సి వ‌చ్చింది. ప్రారంభించిన సినిమాని సైతం మ‌ధ్య‌లో ఆపేయాల్సి వ‌చ్చింది. డిస్ట్రిబ్యూట‌ర్లు..బ‌య్య‌ర్ల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇక రామ్ వైఫ‌ల్యాలు అత‌ని ఇమేజ్ పైనా పాక్షికంగా ప్ర‌భావాన్ని చూపించాయి. తాజాగా ఇటీవ‌లే రిలీజ్ అయిన `స్కంద` తోనైనా విజ‌యం ఖాతాలో వేసుకుంటాడు అనుకుంటే! అది జ‌ర‌గ‌లేదు.

భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఇప్పుడీ టీమ్ అంతా క‌లిసి డబుల్ ఇస్మార్ట్ కి ప‌నిచేస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ చిత్రానికి సీక్వెల్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పూరి అండ్ కో సైతం ఎన్నో ఆశ‌లు ..అంచ‌నాల మ‌ధ్య ప‌ట్టాలెక్కించిన ప్రాజెక్ట్ ఇది. సినిమాతో స‌క్సెస్ అందుకుని ఎలాగైనా గెలుపు గుర్రం ఎక్కాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ స‌క్సెస్ అనేది పూరికి మాత్ర‌మే అత్య‌వ‌స‌రం అనుకుంది మెజార్టీ వ‌ర్గం.

కానీ పూరితో పాటు రామ్..మ‌ణిశ‌ర్మ కూడా ఈ రేసులో కీల‌కంగా మారారు. స్కంద వైఫ‌ల్యంతో రామ్ డైల‌మాలో ప‌డ్డాడు? త‌దుప‌రి సినిమా హిట్ అవ్వ‌క‌పోతే ప‌రిస్థితి? ఏంటి అన్న ఆలోచ‌న బుర్ర‌ని తొలిచేస్తుంది. ప్ర‌స్తుతం రామ్ ఈ సినిమాపైనే మ‌న‌సు పెట్టి ప‌నిచేస్తున్నాడు. ఎలాంటి స్టోరీలు విన‌డం లేదుట‌. `డ‌బుల్ ఇస్మార్ట్` తో విజ‌యం అందుకునే వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కించ కూడ‌ద‌ను కుంటున్నాడుట‌. అలాగే మ‌ణిశ‌ర్మ కూడా స‌క్సెస్ పై ధీమాగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌క్సెస్ అయితే మ‌రింత బిజీ అవ్వాల‌న్న‌ది ప్లాన్ గా తెలుస్తోంది.