Begin typing your search above and press return to search.

కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం.. రామ్ చరణ్ – ఉపాసనలకు కవల పిల్లలు!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు.

By:  Tupaki Desk   |   1 Feb 2026 12:12 AM IST
కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం.. రామ్ చరణ్ – ఉపాసనలకు కవల పిల్లలు!
X

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు పుట్టినట్టు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.




ఈ సందర్భంగా తల్లి ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. తమ కుటుంబంపై అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించిన ప్రేమ, ఆశీర్వాదాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ వార్త బయటకు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమాన లోకంలో ఆనందం వెల్లువెత్తింది. కొణిదెల కుటుంబానికి ఇది నిజంగా డబుల్ బ్లెస్సింగ్గా మారింది. రామ్ చరణ్ – ఉపాసన దంపతుల కొత్త జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు