Begin typing your search above and press return to search.

విశాల్ డోంట్ వర్రీ రా చిచ్చా.. దేవిశ్రీ మాస్ మ్యాజిక్!

తాజాగా రత్నం మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ కళాశాలలో విడుదల చేసిన ఈ పాట.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   16 March 2024 6:37 AM GMT
విశాల్ డోంట్ వర్రీ రా చిచ్చా.. దేవిశ్రీ మాస్ మ్యాజిక్!
X

పందెం కోడి, పొగరు వంటి చిత్రాలతో టాలీవుడ్ లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్. ఈ మాస్ హీరో మూవీలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విశాల్.. ప్రస్తుతం డైరెక్టర్ హరితో రత్నం మూవీ చేస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతోందీ చిత్రం

ఈ సినిమాను జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా రత్నం మూవీ నుంచి అదిరిపోయే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓ కళాశాలలో విడుదల చేసిన ఈ పాట.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డోంట్ వర్రీ.. డోంట్ వర్రీ రా చిచ్చా అంటూ సాగుతున్న ఈ సాంగ్.. తెగ ఆకట్టుకుంటోంది. ఎంతో గ్యాప్ ఇచ్చి దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఆలపించారు. సాంగ్ లో సినిమాలోని విశాల్ క్యారెక్టర్, చిన్నతనం నుంచి హీరో పెరిగిన మొత్తం విధానాన్ని వివరించారు.

ఈ సాంగ్ లిరిక్స్ ను శ్రీమణి అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మంచి ఎనర్జిటిక్ గా అనిపిస్తోంది. సాంగ్ లో విశాల్ డ్యాన్స్ తోపాటు హుక్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. పాట రిలీజ్ అనంతరం విశాల్ వేడుకలో మాట్లాడారు. కాలేజ్ లో పాటను విడుదల చేయడం ఆనందంగా ఉందని విశాల్ తెలిపారు. డైరెక్టర్ హరి.. నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా అని అనిపిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం రత్నం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సమ్మర్ కానుకగా ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక ప్రమోషన్ల స్పీడ్ ను కూడా పెంచనున్నారు. వరుస అప్డేట్లతో సందడి చేయనున్నారు. మరి సాంగ్స్ తోనే మంచి హైప్ తీసుకొస్తున్న మేకర్స్.. ఈ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.