Begin typing your search above and press return to search.

డోంట్ వర్రీ ఫ్యాన్స్.. నేను ఉన్నాగా: నాగవంశీ

అయితే ఈ సారి పెద్ద పండుగకు ఎన్నడూ లేనంతగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:47 PM GMT
డోంట్ వర్రీ ఫ్యాన్స్.. నేను ఉన్నాగా: నాగవంశీ
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి పెద్ద పండుగకు ఎన్నడూ లేనంతగా ఐదు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో మేకర్స్ తమ చిత్రాల కోసం భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

అయితే రిలీజ్ అవ్వనున్న ఐదు సినిమాలు ఇప్పటికే సాలిడ్ క్రేజ్ సంపాదించుకున్నాయి. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్ థియేటర్ల కేటాయింపుల విషయంలో ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో సినిమాకు తగినన్ని థియేటర్ల దొరకేవేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమా నిర్మాత సూర్య దేవర నాగవంశీ స్పందించారు.

థియేటర్ల కేటాయింపుల విషయంలో మహేశ్ ఫ్యాన్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాన్ని తాము చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి థియేటర్లలో ఈ మూవీని విడుదల చేస్తామని వెల్లడించారు. దాంతో పాటు ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

"డియర్ సూపర్ ఫ్యాన్స్. మీకు మళ్లీ స్ట్రాంగ్ గా చెబుతున్నా. మేం అదే మాట మీద ఉన్నాం. గుంటూరు కారం రికార్డు స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఆ విషయం మాకు వదిలేయండి. వేడుకలు ఏ మాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలో మహేశ్ తోపాటు శ్రీలీల, మీనాక్షి చౌదరి లీడ్స్ రోల్స్ లో నటిస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 6వ తేదీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే జనవరి 12వ తేదీన గుంటూరు కారంతో పాటు తేజ సజ్జా హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత రోజు రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్ థియేటర్లలోకి రానున్నాయి. ఇక నాగార్జున సినిమా నా సామి రంగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది. మరి సంక్రాంతి విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.