Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ ప్రాంచైజీ హీరోయిన్‌ బిగ్‌ ట్విస్ట్‌..!

డాన్‌ 2 వచ్చి దశాబ్ద కాలం దాటిన నేపథ్యంలో ఈ ప్రాంచైజీలో మూడో పార్ట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 July 2025 4:00 PM IST
సూపర్‌ హిట్ ప్రాంచైజీ హీరోయిన్‌ బిగ్‌ ట్విస్ట్‌..!
X

బాలీవుడ్‌లో హిట్‌ సినిమాల ప్రాంచైజీల జోరు నడుస్తోంది. ఈ మధ్య కాలంలో పలు ప్రాంచైజీ సినిమాలు వచ్చి పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అందుకే ముందు ముందు రాబోతున్న ప్రాంచైజీ సినిమాల కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన 'డాన్‌' ప్రాంచైజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. దాంతో డాన్ 3 సినిమా కోసం చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. డాన్‌ 2 వచ్చి దశాబ్ద కాలం దాటిన నేపథ్యంలో ఈ ప్రాంచైజీలో మూడో పార్ట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ మధ్య డాన్‌ 3 అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే.

డాన్‌ 3 లో షారుఖ్‌ ఖాన్‌ కాకుండా రణ్వీర్‌ సింగ్ నటించబోతున్నాడు. ఇప్పటికే ఆ విషయమై అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్స్ పలువురు కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. డాన్‌ 3 సినిమాను ప్రకటించిన సమయంలో రణ్వీర్ సింగ్‌కు జోడీగా ముద్దుగుమ్మ కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగింది. దాదాపు ఏడాది క్రితమే టాక్స్ నడిచాయి. ఆ సమయంలో కియారా అద్వానీ డాన్‌ 3 లో నటించేందుకు ఆసక్తి కనబర్చింది, అంతే కాకుండా ఆ సినిమా షూటింగ్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు సన్నిహితులతో చెబుతూ ఉండేది.

డాన్‌ 3 షూటింగ్‌ ప్రారంభంలో జాప్యం జరగడంతో పాటు, కియారా అద్వానీ గర్భవతి కావడంతో సందిగ్ధం నెలకొంది. డాన్‌ 3 సినిమాలో కియారా అద్వానీ నటించాలంటే సినిమా మరో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కియారా అద్వానీ ప్రస్తుతం గర్భవతి కావడంతో, ఆమె బిడ్డకు జన్మనిచ్చి, కొన్నాళ్ల విశ్రాంతి తీసుకునే వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. అందుకే కియారా అద్వానీ స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే విషయమై మేకర్స్ చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డాన్‌ 3 సినిమాలో కియారా అద్వానీ స్థానంను కృతి సనన్‌ భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది ఆరంభం నుంచి ప్రారంభం కాబోతున్న డాన్‌ 3 షూటింగ్‌కి కియారా అద్వానీ పాల్గొనే అవకాశాలు లేవు. అందుకే ఈ సినిమాలో ఆమెకు బదులుగా బాలీవుడ్‌లో ఈ మధ్య ఫుల్‌ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ కృతి సనన్‌ ని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈమధ్య కాలంలో కియారా అద్వానీ పలు సినిమాలను గర్భం దాల్చడం వల్ల వదులుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటన్నింటిలో డాన్‌ 3 ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్‌గా చెప్పుకోవాలి. వార్‌ 2 సినిమాతో రాబోతున్న కియారా అద్వానీకి డాన్‌ 3 మిస్ కావడం కెరీర్‌లోనే బిగ్‌ పాయింట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. కియారా అద్వానీ 2027 వరకు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవని ఆమె సన్నిహితులు అంటున్నారు. కియారా అద్వానీ మాత్రం ఎప్పుడు రీ ఎంట్రీ అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు.