స్టార్ డైరెక్టర్ కిది బిగ్ సవాల్!
బాలీవుడ్ యాక్షన్ ప్రాంచైజీ `డాన్ 3`కి పర్హాన్ అక్తర్ రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 1:30 PMబాలీవుడ్ యాక్షన్ ప్రాంచైజీ `డాన్ 3`కి పర్హాన్ అక్తర్ రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి ఏదో వార్త తెరపైకి వస్తూనే ఉంది. హీరో విషయంలో చాలా కథనాలు వైరల్ అయ్యాయి. అమితాబచ్చన్, షారుక్ ఖాన్ తర్వాత ఐకానిక్ రోల్ లో ఎవరు కనిపిస్తారు? అన్న దానిపై బిగ్ డిబేట్ సైతం నడిచింది. చివరిగా ఆ ఛాన్స్ రణవీర్ సింగ్ దక్కించుకున్నాడు.
దీంతో పర్హాన్ అక్తర్ పర్పెక్ట్ హీరోని తీసుకున్నాడంటూ ప్రశంలందుకున్నాడు. కొన్ని రోజులుగా హీరోయిన్ విషయంలో ఇదే తర్జన భర్జన కొనసాగుతుంది. తొలుత ఈ పాత్రకు కియారా అద్వాణీ ని ఎంపిక చేసారు. రణవీర్ జోడీగా పక్కాగా సూటవుతుందని ఆమెని ఎంపిక చేసారు. కియారా ఎంట్రీ విషయంలో సర్వత్రా ప్రంసలు కురిసాయి. సరైన ఛాయిస్ అంటూ నెటి జనులు పోస్టులు పెట్టారు. అయితే అనూహ్యంగా కియారా గర్బం దాల్చడంతో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయింది.
దీంతో ఇదే పాత్రకు కృతిసనన్ ని ఎంపిక చేసారు. కానీ కృతి ఎంపిక విషయంలో నెటి జనులు మాత్రం సంతోషంగా కనిపించలేదు. రణవీర్ సింగ్ కు జోడీగా సూట్ కాదని...ప్రియాకం చోప్రా పాత్రను ఆమె రీప్లేస్ చేయలేదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగని డైరెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసు కోలేదు. ఏ సినిమాకైనా కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఫైనల్. కర్త, కర్మ, క్రియ అతడే కాబట్టి రాజీ పడక తప్పదు.
అయితే ఈ విషయంలో అభిమానుల్ని సంతృప్తి పరచాల్సిన బాధ్యత డైరెక్టర్ దే. వచ్చిన విమర్శల న్నింటిని హిట్ కొట్టి ప్రశంసలుగా మార్చాలి. ఓరకంగా చెప్పాలంటే ఇది డైరెక్టర్ కిది పెద్ద సవాల్ అని చెప్పాలి. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయి. హీరోతో పాటు హీరోయిన్ కూడా అంతే శ్రమించాలి.