Begin typing your search above and press return to search.

'డాన్ 3'కి లైన్ క్లియ‌ర్ చేసిన కియారా!

'డాన్' ప్రాంచైజీ నుంచి 'డాన్ 3' కి ప‌ర్హాన్ అక్త‌ర్ స‌ర్వం సిద్దం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ఈ ప్రాజెక్ట్ పైనే ప‌నిచేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 July 2025 3:00 AM IST
డాన్ 3కి లైన్ క్లియ‌ర్ చేసిన కియారా!
X

'డాన్' ప్రాంచైజీ నుంచి 'డాన్ 3' కి ప‌ర్హాన్ అక్త‌ర్ స‌ర్వం సిద్దం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని నెల‌లుగా ఈ ప్రాజెక్ట్ పైనే ప‌నిచేస్తున్నాడు. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా...కియారా హీరోయిన్ గా ఎంపిక చేసుకుని ముందు కెళ్తున్నాడు. వాస్త‌వానికి ఈ సినిమా ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాలి. కానీ కియారా అద్వాణి గ‌ర్బం దాల్చ‌డంతో డిలే అయింద‌న్న సంగ‌తి ఈ మ‌ధ్య‌నే తెలిసింది. కియారా కారాణంగానే పర్హాన్ హోల్డ్ లో పెట్టిన‌ట్లు తేలింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి కియారా లైన్ క్లియర్ చేసింది.

కొన్ని గంట‌ల క్రిత‌మే కియారా పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌ని చ్చిన సంగ‌తి తెలిసిందే. డాక్ట‌ర్లు ఆగ‌స్టులో ప్ర‌స‌వం తేదీ ఇచ్చినా? ముందుగానే ప్ర‌స‌వం జ‌రిగింది. త‌ల్లీ-బిడ్డ క్షేమంగా ఉన్నారు. సినిమా లోకి వ‌స్తే జ‌న‌వ‌రి నుంచి షూటింగ్ ప్రారంభించాల‌న్న‌ది ప‌ర్హాన్ ప్లాన్. ఆగ‌స్టులో కియారా ప్ర‌స‌వం జ‌రిగితే ఐదు నెల‌లు గ‌డుస్తుంది. అటుపై కియారా షూటింగ్ కి హాజ‌రవ్వ‌డానికి పెద్ద‌గా ఇబ్బందులుండ‌వని జ‌న వ‌రిలో ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అంత‌కంటే ముందే షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపి స్తున్నాయి.

కియారా ఒకే అనుకుంటే? గ‌నుక డిసెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేక‌పోలేదు. కియారా ఎలా లేద‌న్నా ఆరు నెల‌లు విరామంలో ఉంటుంది. అంటే జ‌న‌వ‌రి నుంచి కియారా షూటింగ్ కి హాజ‌వ ర‌వ్వొచ్చు. ఆరోగ్య ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు కూడా త‌లెత్త‌వు. ర‌ణ‌వీర్ సింగ్ కి కూడా ఇబ్బంది ఉండ‌దు. ఇటీవ‌లే ర‌ణ‌వీర్ `ధురంధ‌ర్` షూటింగ్ పూర్తి చేసాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని పనులుపూర్తి చేసి డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

ర‌ణ‌వీర్ ఆ సినిమా కు డ‌బ్బింగ్ మాత్ర‌మే చెప్పాల్సి ఉంది. మ‌ళ్లీ రిలీజ్ కు ముందు ప్ర‌చార స‌మ‌యంలో హాజ‌ర‌వ్వాల్సి ఉంటుంది. అంత వ‌ర‌కూ ఆ సినిమాకు ర‌ణ‌వీర్ ఎలాంటి డేట్లు ఇవ్వాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ సింగ్ కూడా ప‌ర్హాన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పనుల్లోనే బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది. అత‌డితో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాయిన్ అవుతున్నాడు. లుక్ ప‌రంగా సంసిద్ద‌మ‌వుతున్నాడు.