Begin typing your search above and press return to search.

దేశంలోనే ఫస్ట్ డాల్బీ స్క్రీన్ ప్రారంభం.. మన హైదరాబాద్ లో కూడా!

సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లవర్స్ కు సూపర్ న్యూస్ అని చెప్పాలి. డాల్బీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి డాల్బీ స్క్రీన్ ను మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభించింది

By:  Tupaki Desk   |   5 July 2025 3:18 PM IST
దేశంలోనే ఫస్ట్ డాల్బీ స్క్రీన్ ప్రారంభం.. మన హైదరాబాద్ లో కూడా!
X

సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లవర్స్ కు సూపర్ న్యూస్ అని చెప్పాలి. డాల్బీ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి డాల్బీ స్క్రీన్ ను మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభించింది. సిటీ ప్రైడ్ మల్టీప్లెక్స్ లో ఏర్పాటు చేసింది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో సినిమా చూసే అనుభవాన్ని అందించింది.

పుణెలోనే కాదు.. దేశంలో మరో ఐదు నగరాల్లో కూడా ఐదు డాల్బీ స్క్రీన్ లు మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్, బెంగళూరు, తిరుచ్చి, ఉల్లికల్, కొచ్చిల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది

ఇక పుణెలో ఏర్పాటైన స్క్రీన్ విషయానికొస్తే.. 310 మంది సామర్థ్యంతో సీట్లను 14 వరుసలుగా విభజించారు. 3D విజన్ క్లాసిక్ (ముందు 6 వరుసలు), 3D విజన్ XL (7వ, 13వ వరుసలు), 3D విజన్ ప్రైమ్ (ఎనిమిదవ నుంచి పన్నెండు వరుసలు), 3D విజన్ సోఫా (పద్నాలుగో వరుస - స్క్రీన్ కు దూరంగా) ఏర్పాటు చేశారు.

థియేటర్‌ లో విశాలమైన, రిజర్వబుల్ సీటింగ్, వాల్-టు-వాల్-టు-సీలింగ్ స్క్రీన్‌లు, లైటింగ్ సహా సూపర్ ఇంటీరియర్ వర్క్ చేయించారు. ఇప్పటి వరకు డాల్బీ విజన్ డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్ సిస్టమ్‌ తో అమర్చిన ఏకైక సినిమా హాల్ కూడా ఇదే అవుతుంది. మెరుగైన, స్పష్టమైన విజువల్స్ ను చూసే అవకాశం కల్పిస్తుంది.

"డాల్బీ కంపెనీ సిటీ ప్రైడ్ లో భారతదేశపు మొట్టమొదటి డాల్బీ సినిమా స్క్రీన్ ప్రారంభించడం మాకు గర్వకారణం. ప్రీమియం ఎంటర్టైన్మెంట్ పట్ల పుణెకు ఉన్న మక్కువ ఈ అనుభవానికి అనువైన ప్రదేశంగా చేస్తుంది. అత్యాధునిక సినిమా ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని సిటీ ప్రైడ్ మల్టీప్లెక్స్‌ డాల్బీ భాగస్వామి పుష్కరాజ్ చాఫల్కర్ వెల్లడించారు.

అయితే పుణెలో డాల్బీ స్క్రీన్ ప్రారంభంతో సిటీ ప్రైడ్ ఖరాడి.. లండన్, టోక్యో, న్యూయార్క్‌లోని వాటితో పాటు డాల్బీ సినిమాస్ ప్రపంచ నెట్‌ వర్క్‌ లో చేరింది. సిటీ ప్రైడ్‌ లోని డాల్బీ స్క్రీన్ జులై 4న ఉదయం 10:45 గంటలకు జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ప్రదర్శనతో ప్రారంభమైంది. మరి హైదరాబాద్ లో ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.