Begin typing your search above and press return to search.

ఆస్కార్ వేడుకల్లో క్రేజీ డాగ్.. ఎందుకంటే..?

ఆస్కార్ వేడుకల్లో కుక్కకు ఏం పని అని అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే సినిమా రిలీజైంది. అందులో మెస్సీ అనే క్యారెక్టర్ లో ఆ డాగ్ నటించింది.

By:  Tupaki Desk   |   11 March 2024 6:59 AM GMT
ఆస్కార్ వేడుకల్లో క్రేజీ డాగ్.. ఎందుకంటే..?
X

96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ దేశాల సినిమాలన్నీ పోటీ పడే అకాడమీ అవార్డుల్లో నామినేట్ అయిన సినిమాల నుంచి అవార్డు పొందిన సినిమాలను ప్రకటిస్తారు. లాస్ట్ టైం ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు వచ్చింది. ఆ సాంగ్ కి వచ్చిన అవార్డుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్ లకు అకాడమీ అవార్డులు ఇచ్చారు.

96వ ఆస్కార్ అవార్డుల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమాకు 7 అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత పూర్ థింగ్స్ సినిమాకు 4 అవార్డులు వచ్చాయి. హాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాల్గొనే అకాడమీ అవార్డ్ వేడుకల్లో ఈసారి స్పెషల్ గా ఒక కుక్క కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆస్కార్ వేడుకల్లో ఒక డాగ్ దానికి కూడా ఒక సెపరేట్ చెయిర్ వేసి మరీ కూర్చోబెట్టారు.

ఆస్కార్ వేడుకల్లో కుక్కకు ఏం పని అని అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ అనే సినిమా రిలీజైంది. అందులో మెస్సీ అనే క్యారెక్టర్ లో ఆ డాగ్ నటించింది. ఈ సినిమా బెస్ట్ మూవీ కేటగిరిలో నామినేట్ అయ్యింది. అందుకే అందులో నటించిన కుక్క కూడా ఆస్కార్ వేడుకలకు హాజరైంది. అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాలో నటించడం వల్ల మెస్సీ అదే ఆ డాగ్ చాలా పాపులర్ అయ్యింది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికీ ఛాన్స్ ఉండదు. నామినేట్ అయిన సినిమాల్లోని కొందరు నటీనటులకే ఆ అవకాశం ఉంటుంది. అయితే అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాలో కీలక పాత్ర వేసిన ఈ కుక్క కి మాత్రం అకాడమీ వేడుకకు వచ్చే అవకాశం కల్పించారు. ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు వచ్చింది.

ఇదిలాఉంటే ఆస్కార్ వేడుకల్లో మరోసారి RRR మ్యాజిక్ రిపీట్ అయ్యింది. 96వ అకాడమీ అవార్డుల్లో భాగంగా వరల్డ్ గ్రేటెస్ట్ స్టంట్ సీక్వెన్స్ చూపిస్తూ అందులో RRR ఫైట్ క్లిప్ ఉంచారు. అలా ఆస్కార్ వేదిక మీద మరోసారి RRR వైబ్ కనిపించింది. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ఏ ఇండియన్ సినిమాకు అవార్డులు రాలేదు. ఆ విషయంలో సినీ ప్రియులు అప్సెట్ అయ్యారు.