Begin typing your search above and press return to search.

ఒకప్పటి స్టార్ హీరో పాపను పట్టించుకోరే..?

ఆమె అక్క శివానీ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యి అడపాదడపా సినిమాలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:55 AM GMT
ఒకప్పటి స్టార్ హీరో పాపను పట్టించుకోరే..?
X

రాజశేఖర్, జీవిత దంపతుల కూతుళ్లు శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె అక్క శివానీ కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యి అడపాదడపా సినిమాలు చేస్తోంది. గత ఏడాది కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది.


ప్రస్తుతం ఆమె చేతిలో విద్యావాసుల అహం అనే మూవీ ఉంది. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోంది. అయితే శివాత్మిక దొరసాని తర్వాత తమిళంలో రెండు సినిమాలు చేసింది. తెలుగులో పంచతంత్రం, రంగమార్తాండ మూవీస్ లో కనిపించింది. ఈ రెండు ఓ మోస్తరుగా ఆడాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి సినిమాలు లేవు.

అయితే సోషల్ మీడియాలో మాత్రం శివాత్మిక యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలతో కావాల్సినంత వినోదం కూడా అందిస్తోంది. అయితే యాక్టర్స్ గా మాత్రం ఈ బ్యూటీకి ఛాన్స్ లు రావడం లేదనే మాట వినిపిస్తోంది. రంగమార్తాండ సినిమాలో శివాత్మిక యాక్టింగ్ కి విమర్శకుల ప్రశంసలు లభించాయి.

నటన పరంగా మొదటి సినిమా నుంచి ఆమె తన సత్తా చాటుతూనే ఉంది. అయితే ఎందుకనో ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. అక్క శివానీ కంటే ఎక్కువ ఛాన్స్ లు శివాత్మికకి వస్తాయని అందరూ భావించారు. అయితే శివానీ నటిగా గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తూనే వస్తోంది. ఓ వైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ఆమె సిద్ధంగా ఉంది.

మరి శివాత్మికకి ఎందుకు ఛాన్స్ లు రావడం లేదనేది తెలియడం లేదు. టాలీవుడ్ లో వారసత్వం హీరోలకి కలిసొచ్చినంతగా నటీమణులకి కలిసి రాదనే టాక్ ఉంది. ఈ విషయం కొంతమందిని చూస్తే తెలుస్తుంది. వారి తరహాలోనే శివాత్మికకి కూడా ఆశించిన స్థాయిలో కలిసి రావడం లేదనేది స్పష్టం అవుతోంది.