Begin typing your search above and press return to search.

అనుష్క మొహమాటంగానే చేస్తుందా..?

ఈ సినిమా లో అనుష్క తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసినా సరే సినిమా హిట్ కి ప్రధాన కారణం మాత్రం నవీన్ పొలిశెట్టి అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 12:30 AM GMT
అనుష్క మొహమాటంగానే చేస్తుందా..?
X

స్వీటీ అనుష్క సినిమాల మీద ఆసక్తి చూపించడం లేదు. అందరు అనుకున్నట్టుగా ఆమె ఫిజిక్ వల్ల అనుష్క సినిమాలకు దూరమైందని అంటున్నా అదో రీజన్ మాత్రమే కానీ తనను మెప్పించే కథలు రావడం లేదనే సినిమాలు చేయట్లేదని కొందరు అంటున్నారు. నిశ్శబ్ధం తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా లో అనుష్క తన ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసినా సరే సినిమా హిట్ కి ప్రధాన కారణం మాత్రం నవీన్ పొలిశెట్టి అని చెప్పొచ్చు.

ప్రస్తుతం అనుష్క మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమాలో నటిస్తుంది. మెగా 156 సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా వస్తుంది. జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలో చిరు 156 వ సినిమా వస్తుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ కాబట్టే చిరు సినిమాకు అనుష్క ఓకే అన్నదని.. లేకపోతే అనుష్క ఈ సినిమా చేసే ఉద్దేశం లేదని అంటున్నారు.

చిరుతో అనుష్క స్టాలిన్ సినిమాలో ఒక సాంగ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి సినిమా చేయాలని అనుకున్నా అది కుదరలేదు. ఇన్నాళ్లకు మెగా సినిమాలో అనుష్క ఛాన్స్ అందుకుంది. అయితే చిరు సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా మంచి వెయిట్ ఉండటం వల్లే అనుష్క ఒప్పుకుందని తెలుస్తున్నా వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని ఎందుకు వదులుకోవడం అనే ఆలోచనతో మొహమాటానికి అనుష్క ఈ సినిమా చేస్తుంది కానీ ఆమె కెరీర్ మీద అంత ఆసక్తిగా లేదన్నది ఇన్నర్ టాక్.

అనుష్క పూర్తిగా సినిమాలకు దూరం అవుదామని అనుకున్నా మేకర్స్ మాత్రం ఆమెను సినిమాల్లో నటించాలని ప్రెజర్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ అమ్మడు వారితో సినిమాలు చేస్తుంది కానీ మిగతా సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యిందట. మరోపక్క అనుష్క సినిమాలకు దూరమైంది కదా పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని ఎటాక్ చేస్తున్నారు. అందుకే సినిమాలు చేసినా చేయకపోయినా అనుష్క మీడియా ముందుకు రావట్లేదని తెలుస్తుంది. మెగా 156 తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న అనుష్క ఆ సినిమా తర్వాత అయినా వరుస సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.