Begin typing your search above and press return to search.

డాక్టర్ కాబోయి హీరోయిన్ గా సెటిల్

ఈ చిత్రం తర్వాత మృణాల్ కూడా వరుసగా తెలుగు సినిమాల్లోనే నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:43 AM GMT
డాక్టర్ కాబోయి హీరోయిన్ గా సెటిల్
X

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. తెలుగులో ఫస్ట్ మూవీతో ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. సీతగా అందరి మనసులు దోచుకుంది. ఈ చిత్రం తర్వాత మృణాల్ కూడా వరుసగా తెలుగు సినిమాల్లోనే నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. గతేడాది హాయ్ నాన్నతో అలరించింది.


ఈ సినిమాలో నేచురల్ స్టార్ నానికి జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది మృణాల్ ఠాకూర్. ఇక త్వరలోనే ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వేసవి కానుకగా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవ్వనుంది. ఇటీవల పలువురు టాలీవుడ్ మేకర్స్.. మృణాల్ తో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే చాలా మంది బ్యూటీలు.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్లుగా మారుతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ మృణాల్.. మాత్రం డాక్టర్ అవ్వాలనుకుని హీరోయిన్ గా మారిందట. డెంటిస్ట్ అవ్వాలని అందుకు సంబంధించి కోర్సులో జాయిన్ అయిందట. చదువు కన్నా యాక్టింగ్ పై మంచి ఇంట్రెస్ట్ ఉందట. యాక్టింగ్ చేయాలని అనుకుంటున్నట్లు ఎప్పుడు తన ఫ్రెండ్స్ తో చెప్పేదట మృణాల్.

ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఓ సారి ఎక్కడో ఆడిషన్ జరుగుతుందని మృణాల్ ఠాకూర్ కు ఆమె ఫ్రెండ్ చెప్పిందట. ఆడిషన్ కు వెళ్తే ఇప్పుడే ఛాన్స్ వచ్చేయదు, పిలవడానికి నాలుగు నెలల సమయం పడుతుందని కూడా చెప్పిందట. దీంతో మృణాల్ ఆడిషన్ కు వెళ్లిందట. కానీ అక్కడ ఆమె సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత ఫస్ట్ మూవీలో నటించడం వెంట వెంటనే జరిగిపోయాయట. ఆ మూవీనే మరాఠీ సినిమా హలో నందన్.

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. అలా సినిమాల్లోకి వచ్చిందన్నమాట మృణాల్. అయితే ఈ విషయంపై మృణాల్.. గతేడాది హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా నానికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పింది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు ముందు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మృణాల్ డాక్టర్ అయింటే.. మంచి హీరోయిన్ ను మిస్ అయిపోయే వాళ్లమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఫ్యామిలీ స్టార్ తో మృణాల్.. తెలుగులో హ్యాట్రిక్ కొడుతుందో లేదో చూడాలి.