Begin typing your search above and press return to search.

శివరాత్రికి #DNS స్పెషల్‌ ఏంటో తెలుసా...!

తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది

By:  Tupaki Desk   |   7 March 2024 6:23 AM GMT
శివరాత్రికి #DNS స్పెషల్‌ ఏంటో తెలుసా...!
X

తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. #DNS వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్‌ లుక్ రివీల్‌ చేయబోతున్నారు.

రేపు మహా శివరాత్రి సందర్భంగా సాయంత్రం నాలుగు గంటల అయిదు నిమిషాలకు టైటిల్‌ తో పాటు ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ధనుష్‌ ను సరికొత్తగా దర్శకుడు శేఖర్‌ కమ్ముల చూపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాకుండా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీవల్లి రష్మిక మందన్న ఈ సినిమాలో ధనుష్‌ కి జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్న లీడ్ రోల్‌ తో సినిమా స్థాయి మరింత పెరిగిందని చెప్పాలి.

మహా శివుడి ఆశీస్సులతో ఈ సినిమా యొక్క ఫస్ట్‌ లుక్‌ ను రేపు శివ రాత్రి సందర్భంగా విడుదల చేయడంతో పాటు విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరో వైపు ధనుష్‌ తన స్వీయ దర్శకత్వంలో రాయన్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.