Begin typing your search above and press return to search.

రెండో టిల్లు కోసం ఖర్చు గట్టిగానే..

కచ్చితంగా ఈ సినిమా సిద్దు కెరియర్ కి చాలా కీలకం అని చెప్పాలి. ట్రైలర్, సాంగ్స్ తో మూవీకి మంచి క్రేజ్ వచ్చింది.

By:  Tupaki Desk   |   20 Feb 2024 4:08 AM GMT
రెండో టిల్లు కోసం ఖర్చు గట్టిగానే..
X

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా టిల్లు టిల్లు స్కైర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మార్చిలో ఈ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. రీసెంట్ గా ట్రైలర్ విడుదల అయ్యి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. డీజే టిల్లుకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధం అవుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సిద్దు మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ మూవీ చేస్తోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉండబోతోందని ట్రైలర్ లోనే క్లారిటీ వచ్చేసింది. అనుపమ పరమేశ్వరన్ కళ్ళతోనే కుర్రాళ్ళ మనసులు కొల్లగొడుతుంది. అలాంటిది ఇందులో సిద్దుతో ఏకంగా కిస్సింగ్ సన్నివేశాలు కూడా చేసేసింది. రాధిక లాంటి క్యారెక్టర్ లో అనుపమని చూసి చాలా మంది ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సిద్దు సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది.

ఈ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథలని ఎంపిక చేసుకొని ట్రెండ్ కి తగ్గ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 10 ఏళ్ళు అవుతున్న ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే కొన్నేళ్ల నుంచి తన కోసం తానే కథలు రాసుకుంటూ యూత్ కి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. డీజే టిల్లు మూవీ సిద్దుకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తోంది.

కచ్చితంగా ఈ సినిమా సిద్దు కెరియర్ కి చాలా కీలకం అని చెప్పాలి. ట్రైలర్, సాంగ్స్ తో మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ ధరకి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మూవీ థీయాట్రికల్ బిజినెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ఈ సినిమా కోసం నిర్మాత నాగవంశీ ఏకంగా 35 కోట్ల వరకు ఖర్చు చేసారంట.

అయితే బిజినెస్ అంతకుమించి జరిగిందని తెలుస్తోంది. డీజే టిల్లుకి ఉన్న ఆదరణ కూడా రెండో టిల్లుకి మంచి బిజినెస్ జరగడానికి ఒక రీజన్ అయ్యింది. ఇక సిద్దు కెరియర్ కి కూడా ఈ మూవీ చాలా కీలకం అని చెప్పాలి. దీని తర్వాత చేతిలో మరో రెండు పెద్ద బ్యానర్ లో పెద్ద ప్రాజెక్ట్స్ సిద్దు చేస్తున్నాడు. టిల్లు స్క్వేర్ సక్సెస్ అయితే కచ్చితంగా మరిన్ని అవకాశాలు సిద్దుకి క్యూ కడతాయని చెప్పొచ్చు.