Begin typing your search above and press return to search.

డిజేటిల్లు+ మ్యాడ్ పాత్ర‌ల‌తో ఓ యూనివ‌ర్స్!

`డీజేటిల్లు` ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్స‌స్ సాధించిందో తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన రెండు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   1 April 2025 12:50 PM IST
Naga Vamsi Plane DJ Tillu & Mad Franchise
X

`డీజేటిల్లు` ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్స‌స్ సాధించిందో తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన రెండు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. యూత్ పుల్ ఎంట‌ర్ టైన‌ర్ల‌కు యువ‌త ఫిదా అయింది. కామెడీ జాన‌ర్ లో ఇదొక డిఫ‌రెంట్ ప్రాంచైజీగా నిలిచింది. తెలంగాణ స్లాంగ్ క్రైమ్ కామెడీ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. దీంతో `టిల్లు స్క్వేర్` ఏకంగా 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో `డీజే టిల్లు`కు మూడ‌వ భాగం కూడా ఉంటుంద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

`టిల్లు క్యూబ్` గా ఇది తెర‌కెక్కే అవ‌కాశం ఉంది. అలాగే `మ్యాడ్` ప్రాంచైజీ కూడా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే రిలీజ్ అయిన `మ్యాడ్ స్క్వేర్ `కూడా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తుంది. లాజిక్ లు లేకుండా సినిమా చూడాల‌నుకునే వాళ్లంతా ఫిదా అవుతున్నారు. యూత్ ఫుల్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ కు యువ‌త స‌హా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కూడా బాగా క‌నెక్ట్ అవుతున్నారు.

ఈ సినిమాకి కొన‌సాగింపుగా `మ్యాడ్ 3` ఉంటుంద‌ని వెల్ల‌డించారు. కానీ అందుకు స‌మ‌యం ప‌డుతుంది. ఈ రెండు సినిమాల్ని కూడా నిర్మించి ఒక్క‌రే. అత‌నే సూర్య దేవ‌ర నాగ‌వంశీ. కొత్త ద‌ర్శ‌కులైనా వాళ్ల క‌థ ను..ట్యాలెంట్ ను న‌మ్మి అవ‌కాశం ఇచ్చారు. ఆ న‌మ్మ‌కాన్నిద‌ర్శ‌కులు నిల‌బెట్టుకున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల్లో పాత్ర‌ల‌ని తీసుకుని యూనిర్స్ గా తీసుకొచ్చి మ‌రో కొత్త చిత్రాన్ని నిర్మించాల‌ని నాగ‌వంశీ భావిస్తున్నాడుట‌.

ఇదే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ కు చెప్ప‌గా ఐడియా బాగుందంటూ ఎంకరేజ్ చేసిన‌ట్లు తెలిపారు. డిజేటిల్లు-మ్యాడ్ పాత్ర‌ల్ని క‌లిపి సినిమా చేస్తే ఆ కామెడీ పీక్స్లో ఉంటుంది. కామెడీ ప్రియుల‌కు ఇదో ఫీస్ట్ గానూ ఉంటుంది. మ‌రి ఈ ఐడియాని ఎప్ప‌టికి ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి.